Banana : అరటిపండు తింటే బరువు పెరుగుతుందా, తగ్గుతుందా.. నిపుణుల సూచనలు ఇవే!
Banana : అరటిపండు..భారతీయ గృహాల్లో తరచూ కనిపించే పండు. సంవత్సరం పొడవునా తక్కువ ధరకు లభించడమే కాకుండా, రుచి, ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఈ పండు ఇష్టపడతారు. అయితే చాలామందికి ఒకే ప్రశ్న – అరటిపండు తింటే బరువు పెరుగుతుందా, లేక తగ్గుతుందా?ఈ సందేహానికి డైటీషియన్లు, పోషకాహార నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతున్నారు.
Banana : ఇలా చేయండి..
అరటిపండులో ఉన్న పోషక విలువలు చూస్తే.. 105 క్యాలొరీలు, 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ఫైబర్, 1.3 గ్రాముల ప్రొటీన్, 0.3 గ్రాముల కొవ్వు ఉంటాయి.దీనిలో సహజ చక్కెర, ఫైబర్ అధికంగా ఉండటంతో ఇది తక్షణ శక్తిని అందించే ఫలంగా గుర్తించబడుతోంది. అరటిపండును ఎక్కువగా తినడం, ముఖ్యంగా నిద్రకు ముందు లేదా శారీరక శ్రమ లేని సమయంలో తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Banana : అరటిపండు తింటే బరువు పెరుగుతుందా, తగ్గుతుందా.. నిపుణుల సూచనలు ఇవే!
ఇందులోని అధిక కార్బోహైడ్రేట్లు, చక్కెర శరీరంలో కొవ్వుగా మారే అవకాశం ఉంది. రోజుకు 2-3 పండ్లు తినడం బరువు పెరగడానికి దారితీయవచ్చు.అరటి వల్ల బరువు తగ్గాలంటే తగిన పరిమాణంలో (రోజుకు 1 పండు) తీసుకోవాలి. ఉదయం అల్పాహారం సమయంలో లేదా వ్యాయామానికి ముందు తినడం చేయాలి. రోజుకు ఒక అరటిపండు తినడం సురక్షితం.