Junior NTR : టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కు స్థానం ఉందా? ఉన్నా.. చంద్రబాబు రానిస్తారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Junior NTR : టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కు స్థానం ఉందా? ఉన్నా.. చంద్రబాబు రానిస్తారా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 March 2021,9:14 am

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కింగ్. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ పెద్ద స్టార్ హీరో. అందులోనూ సీనియర్ ఎన్టీఆర్ మనవడు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కు అంత పాపులారిటీ. నిజానికి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ నిలదొక్కుకున్నాడంటే దానికి కారణం ఆయనే. ఆయన హార్డ్ వర్క్, ఆయన నటన, సినిమా కోసం ఆయన చేసే కృషి ఆయన్ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ లో నిలబెట్టాయి.

does junior ntr have space in tdp will chandrababu accept junior ntr

does junior ntr have space in tdp, will chandrababu accept junior ntr

అయితే.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకే పరిమితం కాకుండా.. రాజకీయాల్లోకి కూడా రావాలని తన అభిమానులు, టీడీపీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇది ఇప్పుడే కాదు.. చాలా ఏళ్ల నుంచి కోరుకుంటున్నదే. అందుకే 2009 ఎన్నికల్లో చంద్రబాబు మాటను నమ్మి జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీ తరుపున అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ తరుపున ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అప్పుడు ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహించగా… ఆ రోడ్ షోలకు భారీగా రెస్పాన్స్ వచ్చింది.

ఆ ఎన్నికల ప్రచార సమయంలో.. చంద్రబాబు, బాలకృష్ణ రోడ్ షోల కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షోలకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ బాగా మాట్లాడగలడు. ఎవరితో ఎలా మెలగాలో తెలుసు. మొత్తానికి తన తాత ఎన్టీఆర్ ను అచ్చు గుద్దినట్టే ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. అందుకే.. టీడీపీ అభిమానులు కూడా ఇక జూనియర్ ఎన్టీఆర్ మీదనే ఆశలు పెట్టుకున్నారు.

Junior NTR : కుప్పం రోడ్ షోలో జై ఎన్టీఆర్ అంటూ టీడీపీ అభిమానుల నినాదాలు

అయితే.. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన చేసినప్పుడు.. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే.. టీడీపీ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు.. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలంటూ నినదించారు. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో తెలియక.. మౌనంగా తల ఊపాల్సి వచ్చింది.

అప్పుడు అక్కడి నుంచి తప్పించుకోవడం తప్పితే.. చంద్రబాబు మళ్లీ ఎన్టీఆర్ పేరు కూడా తీయలేదు. జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలి.. పార్టీలోకి ఎన్టీఆర్ రావాలి.. జై ఎన్టీఆర్.. అంటూ అక్కడున్న వాళ్లంతా నినాదాలు చేయడంతో.. సీన్ ఒక్కసారిగా మారిపోయింది.

Junior NTR : 2024 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా జూనియర్ ఎన్టీఆర్ ను ప్రకటిస్తే?

2024లో ఏపీలో జరగబోయే సాధారణ ఎన్నికల సమయం నాటికి టీడీపీ పుంజుకుంటుందన్న నమ్మకమయితే చంద్రబాబుకు లేదు.. టీడీపీ అభిమానులకు కూడా లేదు. ఏపీలో వైసీపీ రోజురోజుకూ బలపడుతోంది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో అయితే.. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ గెలిచి అక్కడ తమ జెండాను ఎగురవేసింది. టీడీపీ రోజురోజుకూ నశిస్తుంది తప్పితే బలపడటం లేదు. ఇలాగే ఉంటే.. పార్టీ నామరూపం లేకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి.. జూనియర్ ఎన్టీఆర్ ను 2024 లో చంద్రబాబు సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. టీడీపీకి మేలు జరగొచ్చు.. అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. పార్టీ శ్రేణులు కూడా అదే కోరుకుంటున్నారు.

కానీ.. చంద్రబాబు.. ఎన్టీఆర్ ను అసలు పార్టీలోకి ఆహ్వానిస్తారా? ఏకంగా సీఎం అభ్యర్థినే చేస్తారా? తన కొడుకు లోకేశ్ ను దృష్టిలో పెట్టుకొని.. ఎన్టీఆర్ ను పార్టీలోకి పిలిచి.. అందలం ఎక్కించే అవకాశాలు చాలా తక్కువ అనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఒకవేళ.. చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించినా.. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తారా? అనేది కూడా పెద్ద డౌటే. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది