Pawan Kalyan : ఇప్పటికైనా ఎల్లో బ్యాచ్ వేషాలు పవన్ కళ్యాణ్ అర్ధం చేసుకుంటాడా..!
Pawan Kalyan : జనసేన పార్టీపై ఏపీలో కుట్ర జరుగుతోందా? 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీ రాజకీయాలను శాసించబోతుందని ముందే మిగతా రాజకీయ పార్టీలు పసిగట్టాయా? జనసేన పార్టీ మీద కులముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందా? అంటే.. ఎల్లో, బ్లూ మీడియాను చూస్తే అదే అనిపిస్తోంది. వాళ్ల ఆగడాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు టీడీపీ.. పవన్ కళ్యాణ్ ను చేరదీస్తున్నట్టు నటిస్తోంది. పవన్ ను చేరదీస్తున్నట్టు నటిస్తూనే ఆయన్ను బలహీనం చేయాలని చూస్తోంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ను కాపు కులానికి పరిమితం
చేసి వేరే కులాల్లో చిచ్చు పెట్టాలని ఎల్లో మీడియా చూస్తోందట. ఎల్లో పక్కన పెడితే.. నీలి మీడియా కూడా అదే చేస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను బలహీనం చేసేందుకు ఉన్న అన్ని దారులను వెతుకుతున్నారా? కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది అంటూ నీలి మీడియా కథనాలు వడ్డించిన విషయం తెలిసిందే. నిజానికి.. కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ల పాటు ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. పవన్ కళ్యాణ్ గైడెన్స్ లోనే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి దూరం అయ్యారని అంటున్నారు. నిజానికి.. ఒకప్పుడు ప్రజారాజ్యానికి ఒకప్పుడు జరిగిన కుట్రే ఇప్పుడు జనసేన మీద జరుగుతోంది.
Pawan Kalyan : పవన్ గైడెన్స్ లోనే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి దూరం అయ్యారా?
మెగాస్టార్ చిరంజీవి తట్టుకోలేక పార్టీనే కాంగ్రెస్ లో కలిపేశారు. కానీ.. పవన్ కళ్యాణ్ తట్టుకుంటున్నారు. ఎంత కుట్ర జరిగినా అస్సలు మెత్తబడటం లేదు. జనసేన అంటేనే కాపుల పార్టీ ముద్ర వేయాలని చూస్తున్నారు. కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం కాపు, గీపు ఏదీ లేదు.. తాను అన్ని కులాలు, అన్ని మతాలను చెందిన వాడిని అని చెబుతున్నారు. నిజానికి ఆయన ఎక్కడ కూడా ఇప్పటి వరకు కుల ప్రస్తావనే తీసుకురాలేదు. కానీ.. కావాలని ఎల్లో, నీలి మీడియా చేస్తున్న ఆరోపణలు. మరి.. ఎల్లో మీడియా, నీలి మీడియా ఎత్తుగడలను పవన్ కళ్యాణ్ తెలుసుకుంటాడా? అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.