Egg Dum Biryani Recipe : ఎగ్ దమ్ బిర్యాని ఇలా చేశారంటే… సూపర్ టేస్టీగా ఉంటుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Egg Dum Biryani Recipe : ఎగ్ దమ్ బిర్యాని ఇలా చేశారంటే… సూపర్ టేస్టీగా ఉంటుంది…

 Authored By prabhas | The Telugu News | Updated on :17 September 2022,7:30 am

Egg Dum Biryani Recipe : బిర్యానీ పేరు వింటే చాలు నోట్లో నుంచి నీళ్లు ఊరతాయి. ఎగ్ బిర్యాని, చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీ ఇలా ఎన్నో రకాల బిర్యానీలు తయారు చేసుకోవచ్చు. వాటన్నింటిలో ఎగ్ బిర్యానీ సులువుగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యాని చేసుకుని తిన్నామంటే ఆ రుచిని మర్చిపోలేం మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎగ్ దమ్ బిర్యాని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు : 1) ఎగ్స్ 2) ఆయిల్ 3)ఉల్లిపాయ 4) టమాట 5) పెరుగు 6) పచ్చి మిర్చి 7) ధనియాలు 8) పుదీనా 9) కొత్తిమీర 10)బిర్యానీ ఐటమ్స్ 11) కారం 12) ఉప్పు 13) పసుపు 14) నెయ్యి 15) ఎల్లో ఫుడ్ కలర్ 16) జీలకర్ర 17) మిరియాలు ..

తయారీ విధానం: ముందుగా బిర్యానీ కోసం మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి. దీనికోసం మిక్సి జార్ లో ఒక ఇంచు దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, నాలుగు యాలకులు, ఒక అనాసపువ్వు, ఒక జాపత్రి, అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ గసగసాలు, కొన్ని జీడిపప్పు పలుకులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మిక్సీ పట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒక పెద్ద టమాట ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ముప్పావు కప్పు పెరుగు, ఒకటిన్నర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో రెండు లీటర్ల వాటర్ పోసి బిర్యానీ ఐటమ్స్ అన్ని వేసి ఒక టి స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి వాటిని బాగా మరిగించుకోవాలి. తర్వాత ఇందులో ఒక గంట పాటు నానబెట్టుకున్న 500 గ్రాముల బాస్మతి బియ్యాన్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి 90% రైస్ ని ఉడికించుకోవాలి.

Egg Dum Biryani Recipe video on youtube

Egg Dum Biryani Recipe video on youtube

ఇప్పుడు మరో స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆరు లేదా 8 ఉడికించుకున్న గుడ్లను వేసుకోవాలి. ఇందులో అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి గుడ్లను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పెనంలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బిర్యానీ ఐటమ్స్ అన్ని వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుని ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి టమాటా పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుని తర్వాత పెరుగు ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న దాన్ని కూడా వేసి వేయించుకొని పావు కప్పు వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి అందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి రెండు నిమిషాలు ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోని ఇందులో సగం ఒక గిన్నెలోకి వేసి ఇప్పుడు ఇందులో ఉడికించిన అన్నాన్ని లేయర్లుగా వేసుకొని పైన కొత్తిమీరతో గార్లిక్ చేసి కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసి మూత పెట్టుకోని దమ్ చేయాలి. దమ్ చేయడానికి స్టవ్ పై ఒక పెనం పెట్టి దానిపైన ఈ ఎగ్ ను దమ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన ఎగ్ దమ్ బిర్యాని రెడీ.

YouTube video

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది