Electric Scooter : ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఒకినోవా కొత్త స్కూటర్.. ఒక్క‌సారి చార్జీంగ్ చేస్తే 160 కిలోమీటర్లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Electric Scooter : ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఒకినోవా కొత్త స్కూటర్.. ఒక్క‌సారి చార్జీంగ్ చేస్తే 160 కిలోమీటర్లు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :26 March 2022,6:30 pm

Electric Scooter : పెట్రోల్‌ కంటే ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌కు అయ్యే నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. పైగా పెరుగుతున్న ధరలతో వాహనదారులు టెక్నాలజీకి అనుగుణంగా అప్‌డేట్‌ అవుతున్నారు. ఈనేపథ్యంలో స‌రికొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు అందుబాటులోకి వ‌స్తున్నాయి.తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఒకినోవా తన Okhi 90 కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కూటర్ అనేక ఫీచ‌ర్స్ కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ పథకం కింద అందిస్తున్న ప్రోత్సాహకాలు తీసివేసిన తరువాత దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.21 లక్షలుగా ఉంది.

కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో కూడా వినియోగదారులు దీనిని బుక్ చేసుకునేందుకు అవకాశాన్ని కంపెనీ అందిస్తోంది. లేదా దగ్గరలోని ఏదైనా ఒకినోవా షోరూమ్ ను సందర్శించి కేవలం రూ. 2000 టోకెన్ అమౌంట్ చెల్లించి కూడా దీనిని బుక్ చేసుకోవచ్చని సంస్థ స్పష్టం చేసింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం దిల్లీలో రూ.1.03 లక్షలు, మహారాష్ట్రలో రూ.1.03 లక్షలు, గుజరాత్ లో రూ.1.01 లక్షలు, రాజస్థాన్ లో రూ. 1.14 లక్షలు, ఒడిశాలో రూ. 1.16 లక్షల రూపాయల ప్రారంభ ధరలో అందుబాటులో బైక్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

electric scooter comes with new features

electric scooter comes with new features

Electric Scooter : స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో..

ఒకినావో ని బ్యాటరీ 3.6kWh రిమూవబుల్ లిథియం బ్యాటరీకి 3.8kW ఎలక్ట్రిక్ మోటారు అటాచ్ అయి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. స్పోర్ట్స్ మోడ్ లో ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేసిన వాహనం 160 కిలోమీటర్లు ప్రయాణించగలదని.. అదే ఎకో మోడ్ లో 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి అదనంగా డిజిటల్ ఎల్ఈడీ లైట్లు, బ్లూచూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ న్యావిగేషన్, ఆటోమెటిక్ కీ లెస్ స్టార్ట్, యూఎస్బీ ఛార్జర్ వంటి అదరగొట్టే ఫీచర్లతో ఇది అందుబాటులోకి వస్తోంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు గరిష్ఠంగా 90 కిలోమీటర్లుగా ఉంది. బ్యాటరీని 0 నుంచి 100 వరకు ఛార్జింగ్ చేయటానికి 3 నుంచి 4 గంటల మధ్య సమయం పడుతోందని కంపెనీ వెల్లడించింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది