Electric Vehicles Sales : ఈ-వెహికిల్స్ అమ్మకాల జోరు… పెరిగిన టూవీలర్స్ సేల్స్..
Electric Vehicles Sales : ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్లు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు. సామాన్యులు ఈ రేట్లను జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా టూవీలర్స్ అయితే బండ్లు బయటకు తీయడమే మానేసారు. ఆటోల్లో బస్సుల్లో వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడటం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నట్లు ప్రభుత్వాలు పేర్కొన్నాయి. సామాన్య ప్రజానీకం దానికి భిన్నంగా చమురుపై విధించిన పన్నులను తగ్గించాలని కోరుతున్నారు. పెరుగుతున్న ధరల కారణంగా సాధారణ ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికిల్స్ పై ఆసక్తి చూపుతున్నారు.పెరుగుతున్న పెట్రోల ధరల భారాన్ని తగ్గించుకునేందుకు వాహన కొనుగోలుదారులు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ వెహికిల్స్ వైపు చూస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను కూడా కేంద్రం ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.గంటకు 25కిమీ కంటే తక్కువ వేగంతో వెళ్లే ఎలక్ట్రిక్ వాహనాలకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఈ తరహా వాహనాలు 2020లో 73,529 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021లో 24 శాతం వృద్ధి చెంది 91,142 వాహనాలు విక్రమయ్యాయి. బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా హై-స్పీడ్ బైక్‌లపై ఆయా సంస్థలు ప్రోత్సాహకాలనూ అందిస్తున్నాయి.కాగా ఎస్ఎంఈవీ-వాహన్(SMEV VAHAN) డేటా ప్రకారం.. హీరో ఎలక్ట్రిక్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ 2021లో 46,214 యూనిట్ల అమ్మకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. జాబితాలో ఆ తర్వాతి స్థానంలో ఒకినావా 29,868 యూనిట్లు, ఆథర్ 15,836 యూనిట్లు, ఆంపియర్ 12,417 వాహనాలు ఉన్నాయి. బెంగళూరు కేంద్రంగా ఈవీ వాహనాలను ఉత్పత్తి చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ఆరో స్థానంలో ఉంది.
electric vehicles sales: టూ వీలర్స్ అమ్మకాలు ఇలా..
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఈ ఏడాది 10 లక్షల యూనిట్లు దాటే అవకాశం ఉందని ప్రముఖ కంపనీలు అభిప్రాయపడుతున్నాయి. ఒక్క 2021లోనే దేశంలో ఎలక్ట్రిక్ బైక్‌ల విక్రయాలు మూడు రెట్లు పెరిగాయంటే ఈ-బైక్స్‌పై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని గమనించవచ్చు. 2020లో 33,971 టూవీలర్ ఈవీ యూనిట్లు అమ్ముడవగా.. 2021లో 1,00,736 సేల్స్ నమోదయ్యాయి. ఇవేగాక త్రీ వీలర్లు, ఈ-కార్లు, ఎలక్ట్రిక్ బస్సులు కూడా పెద్దసంఖ్యంలోనే అమ్ముడయ్యాయి.2020-2021 తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో మూడింతలు ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగినట్లు ఆటో మోబైల్ డీలర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ తెలిపింది. టూవీలర్స్ 2020-2021 లో1.34821 ఈవీ వాహనాలు సేల్ కాగా 2021-22లో 4,29217 యూనిట్లు విక్రయించినట్లు తెలిపింది.