Elon Musk : ట్రంప్ విజయంతో దూసుకెళుతున్న ఎలన్ మస్క్..టెస్లా మార్కెట్ క్యాప్ ఎంత పెరిగిందంటే..!
ప్రధానాంశాలు:
Elon Musk : ట్రంప్ విజయంతో దూసుకెళుతున్న ఎలన్ మస్క్..టెస్లా మార్కెట్ క్యాప్ ఎంత పెరిగిందంటే..!
Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎవరు లాభపడ్డారో తెలియదు కాని ప్రపంచంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా షేర్లలో భారీ పెరుగుదల కనిపించింది. శుక్రవారం(నవంబర్ 8), టెస్లా షేర్లు 8.2 శాతం పెరిగాయి, ఆ తర్వాత టెస్లా మొత్తం మార్కెట్ క్యాప్ 1 ట్రిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ. 84 వేల కోట్లకు చేరుకుంది. ఈ భారీ జంప్ ట్రంప్ విజయంతో ఎలాన్ మస్క్ కంపెనీలకు మరిన్ని లాభాలు వస్తాయని ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు రేకెత్తించాయి. టెస్లా షేర్లు 14.75 శాతం వృద్ధి చెంది 288.53 డాలర్ల వద్ద ముగిశాయి. దీంతో ఒక్కరోజే ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద 290 బిలియన్ డాలర్లకు పెరిగింది. 300 బిలియన్ డాలర్ల మార్కుకు అత్యంత చేరువలో ఉన్నారు. ఈ ఏడాదిలో ఎలన్ మస్క్ సంపద 60 బిలియన్ డాలర్లు పెరిగింది.
Elon Musk పెద్ద ప్లానే..
ట్రంప్ విజయం తర్వాత ఆటోమేటిక్ డ్రైవింగ్ టెక్నాలజీకి ప్రభుత్వం నుంచి వేగవంతమైన నియంత్రణ ఆమోదం లభించే అవకాశం ఉన్నందున మస్క్ ఈ ప్రయోజనం పొందవచ్చని అందరు అంటున్నారు. అంతేకాక సీఎఫ్ఆర్ఏ రీసెర్చ్‌లోని సీనియర్ ఈక్విటీ విశ్లేషకుడు గారెట్ నెల్సన్ ప్రకారం, టెస్లా, దాని సీఈఓ ఎలోన్ మస్క్ ఎన్నికల ఫలితాల తర్వాత అతిపెద్ద లబ్ధిదారులు కావచ్చు. స్వయంప్రతిపత్త వాహనాల అనుకూల నియంత్రణ కోసం మస్క్ ట్రంప్ పరిపాలనపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఇది టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ టెక్నాలజీ అభివృద్ధిని వేగవంతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.మస్క్ ప్లాన్‌లో ఇంతకుముందు, 30,000 డాలర్ల కంటే తక్కువ ఖర్చుతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలనే ప్రతిపాదన ఉంది.
కానీ ఇప్పుడు అతని దృష్టి ఆటోమేటిక్ వాహనాలపై పడింది. అయితే, నియంత్రణ, సాంకేతిక సవాళ్ల కారణంగా, ఈ వాహనాల వాణిజ్యీకరణలో చాలా జాప్యం జరుగుతోంది. మార్నింగ్‌స్టార్ ఈక్విటీ వ్యూహకర్త డేవిడ్ విస్టన్ ప్రకారం, ఫెడరల్ స్థాయిలో ఏకీకృత స్వయంప్రతిపత్త వాహన నిబంధనలను ఏర్పాటు చేయడానికి మస్క్ ట్రంప్‌ను ఒప్పించగలిగితే, అది మొత్తం ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రయోజనకరంగా ఉంటుంది.ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం, అతని నికర విలువ ఇప్పుడు 300 బిలియన్ డాలర్లకు మించిపోయింది. టెస్లా షేర్లలో ఈ పెరుగుదల అక్టోబర్ చివరి నుండి ప్రారంభమైంది. కంపెనీ దాని త్రైమాసిక లాభంలో మెరుగుదల, రాబోయే సంవత్సరానికి డెలివరీలలో 20 నుండి 30 శాతం పెరుగుదల అంచనాను విడుదల చేసింది.