EPFO : ఈపీఎఫ్ ఖాతాదారులకు బాడ్ న్యూస్ .. త్వరలోనే వడ్డీ రేటు పై కీలక నిర్ణయం ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

EPFO : ఈపీఎఫ్ ఖాతాదారులకు బాడ్ న్యూస్ .. త్వరలోనే వడ్డీ రేటు పై కీలక నిర్ణయం ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :7 March 2023,11:00 am

EPFO : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వడ్డీ రేటు పై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. 2021 – 22 ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ ఇంకా తక్కువ ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మార్చి 25 , 26 తేదీల్లో సెంట్రల్ బోర్డ్ దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరోనా టైంలో విత్ డ్రాయల్స్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కోవిడ్ తగ్గాక విత్ డ్రాయల్స్ కూడా తగ్గాయి. దీంతో పెట్టుబడులపై ఈపీఎఫ్ఓకు లాభాలు పెరిగాయి. ఈసారి ఈపీఎఫ్ వడ్డీ రేటు దాదాపు 8 శాతం గా ఉండే ఛాన్స్ ఉంది.

EPFO decision on interest

EPFO decision on interest

గతేడాది కన్నా ఈసారి వడ్డీ రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. వడ్డీ రేటు 8.1% కొనసాగించడం లేదా ఎనిమిది శాతానికి తగ్గించడం అనేదానిపై మార్చ్ 26న నిర్ణయం తీసుకొని అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమావేశానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. వడ్డీ రేటు 8% కంటే తక్కువకు వెళ్లే అవకాశం లేదని భావిస్తున్నారు. ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్, ఆడిట్ కమిటీ 2022 23 వడ్డీ రేట్లు సిఫార్సు చేయడానికి ఒకరోజు ముందు సెంట్రల్ బోర్డ్ ట్రస్టిష్ సమావేశం అవుతుంది.

EPFO decision on interest

EPFO decision on interest

గత ఏడాది మార్చిలో ఆరు కోట్ల మంది యాక్టివ్ సబ్స్క్రైబర్లకు 8.1% వడ్డీ సిఫార్సు చేసింది. ఇది గత నాలుగు దశాబ్దాలలో కనిష్టం అంతకన్నా ముందు 8.5% వడ్డీ ఉండేది. ఏకంగా 40 బేసిస్ పాయింట్స్ వడ్డీని తగ్గించింది. పిఎఫ్ వడ్డీ తగ్గిస్తే ఈపీఎఫ్ ఖాతాదారులకు తమ కాంట్రిబ్యూషన్ పై వచ్చే వడ్డీ తగ్గుతుంది. గతేడాది 4 సార్లు తక్కువ వడ్డీ ప్రకటించడం ఉద్యోగులను నిరాశకు గురి చేసింది. 1977 సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ 8% ఉండేది. ఈపీఎఫ్ఓ ప్రతిపాదించిన వడ్డీకి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోద ముద్రవేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఖాతాదారుల ఎకౌంట్లో వడ్డీ చేరుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది