ఈటెల కొత్త పార్టీ కన్ఫర్మ్.. ఇవి అందుక సాక్ష్యాలు
etela rajendar గత కొన్ని నెలల సస్పెన్స్ కు తెర దించుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా మంది భావించినట్లుగా ఈటెల etela rajendar ను మంత్రి వర్గం నుండి ఆ తర్వాత మెల్లగా పార్టీ నుండి బయటకు పంపించేశాడు అంటూ కొందరు ముచ్చటించుకుంటున్నారు. మరి కొందరేమో ఈటెల etela rajendar దారెటు అనే విషయమై అంతర్జాతీయ సమావేశం మాదిరిగా సీరియస్ గా చర్చిస్తున్నారు. ఇంతకు ఈటెల రాజేందర్ దారి ఎటు అనేది ఆయన అనుచరులకు కూడా అంతు పట్టకుండా మొన్నటి వరకు ఉంది. కాని ఇప్పుడు మెల్ల మెల్లగా క్లారిటీ వస్తుంది. ఈటెల గులాబీ జెండా వదిలి ఏ కాషాయమో లేదా హస్తం జెండానో పట్టుకోవాలని భావించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త పార్టీ ఉత్తమం అన్నట్లుగా ఆయన భావిస్తున్నాడట.
etela rajendar వామపక్ష భావజాల పార్టీ..
తెలంగాణలో ఇప్పటికి వామపక్ష భావజాల భావంతో ఎంతో మంది ఉంటారు. ఆ పార్టీలు లేకున్నా కూడా ఇంకా కొందరు ఆ దిశగా అడుగులు వేసేందుకు ఆసక్తిగా ఉన్న వారు ఉన్నారు. అలాంటి వారందరిని ఏకతాటిపైకి తీసుకు వచ్చి బహుజనుల పార్టీగా తన పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆయన ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చాడు.
ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మరియు మరేదైనా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మెడలో నీలం రంగు కండువ ధరించడంతో పాటు తన సోషల్ మీడియా పేజీల్లో బిగించిన పిడికిలిని తెలంగాణ పటంపై ఉంచి బ్యాక్ గ్రౌండ్ లో కూడా కాస్త నీలి వర్ణం పెట్టి తెలంగాణ అమర వీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహం ఇంకా అంబేద్కర్, జయశంర్, పూలల బొమ్మలను ఉంచారు. ఆ తరహాలో పార్టీ సిద్దాంతాలు ఉంటాయని ఆయన చెప్పకనే చెబుతున్నాడు.
etela rajendar పార్టీ మనుగడకు సాధ్యం ఎంత..
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ శూన్యత అయితే లేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కనుక బలంగానే కనిపిస్తుంది. మరో వైపు ఈమద్య కాలంలో బీజేపీ బలం పుంజుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా కొత్త నాయకత్వంతో ముందుకు దూకేందుకు సిద్దంగా ఉన్న సింహం మాదిరిగా ఉంది. ఇలాంటి సమయంలో కొత్త పార్టీ లు వస్తున్నాయి. కొత్త పార్టీ షర్మిల నుండి వచ్చింది. మరో పార్టీ ఈటెల నుండి వస్తే జనాలు ఎంత వరకు పట్టించుకుంటారు అనేది చూడాలి.