Etela Rajender : కేసీఆర్ గురించి ఎవ్వరికీ తెలియని సంచలన నిజాలు బయటపెట్టిన ఈటల?
Etela Rajender : సీఎం కేసీఆర్ మునపటి వ్యక్తిలా లేరు. ఆయనకు ఉద్యమ బంధాలు ఇప్పుడు లేవు. ఒకప్పటి కేసీఆర్ వేరు.. ఇప్పటి కేసీఆర్ వేరు.. మానవ సంబంధాలు కూడా ఆయనకు లేవు. ఉద్యమ బంధాలు, మానవ బంధాలు.. ఈ రెండు ఆయన డిక్షనరీలోనే లేవు. రాజ్యం మీదనే ఆయనకు ప్రేమ. దానికి సంబంధించిన లక్షణాలే ఉన్నాయి. రాజ్యానికి చెందిన కర్కశత్వమే ప్రస్తుతం ఆయనలో కనిపిస్తోంది.. అంటూ తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ గురించి సంచలన నిజాలను బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన అసైన్డ్ భూముల కబ్జా వ్యవహారంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కొందరు రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం.. వెంటనే సీఎం కేసీఆర్.. ఆ లేఖపై స్పందించి విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత ఈటల కూడా ప్రెస్ మీట్ పెట్టి.. తను ఏ తప్పు చేయలేదన్నారు. ఆ తర్వాత తెల్లారే ఈటల వైద్యారోగ్య మంత్రిత్వ శాఖను సీఎం కేసీఆర్ కు అటాచ్ చేశారు. అలాగే… ఒకేసారి మీడియాలో కూడా భూకబ్జా వ్యవహారంపై కథనాలు ప్రసారం అయ్యాయి. ఇవన్నీ కావాలని ముందస్తు ప్రణాళికతో ఈటలపై దాడి చేసినట్టు పక్కాగా తెలుస్తోంది.
టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈటల రాజేందర్ కు సీఎం కేసీఆర్ తో అనుబంధం ఉంది. అది దీర్ఘకాల అనుబంధం. కానీ.. ఆ బంధం ఇప్పుడు లేదు. ఆయనకు ప్రస్తుతం ఏ దారీ దొరకడం లేదు. తన భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఆయన తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. నేనైతే ఇక్క ఇంచు భూమిని కూడా కబ్జా చేయలేదు. కావాలని నన్ను ఇరికించడానికి దీన్ని ఒక సాకుగా తెర మీదికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ హైకమాండ్ ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోంది… అని ఈటల అన్నారు.
Etela Rajender : నన్ను వదిలించుకోవాలని కేసీఆర్ అనుకొని ఉండొచ్చు
నన్ను వదిలించుకోవాలని సీఎం కేసీఆర్ అనుకొని ఉండొచ్చు. అందుకే నా క్యారెక్టర్ ను బ్యాడ్ చేశారు. అందుకే ఉద్దేశపూర్వకంగా వాళ్ల మీడియాలో నాకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయించారు. కథనాలు రాయించారు. నన్ను ఎందుకు వదిలించుకోవాలనుకున్నారో వాళ్లకే తెలియాలి. నన్ను బ్యాడ్ చేస్తే వాళ్లకు ఏం వస్తుందో నాకు తెలియదు. నా వల్ల పార్టీకి ఏ విధంగా నష్టం వస్తుందని వాళ్లు అనుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇదంతా కేసీఆర్ డైరెక్షన్ లోనే జరుగుతోంది. తెలంగాణ వచ్చే వరకే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉండేది. 2014 తర్వాత అది ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది. అందుకే ఉద్యమం ముందు ఉన్న కేసీఆర్ వేరు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వేరు. 2018 ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్ చాలా మారిపోయారు… అని మంత్ర ఈటల షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.