దొర‌ల పాల‌న‌కు నేను వ్య‌తిరేకం.. చావ‌నైనా చ‌స్తాకానీ అవినీతి చెయ్య‌.. ఈటల సంచ‌ల‌న ప్రెస్ మీట్‌ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

దొర‌ల పాల‌న‌కు నేను వ్య‌తిరేకం.. చావ‌నైనా చ‌స్తాకానీ అవినీతి చెయ్య‌.. ఈటల సంచ‌ల‌న ప్రెస్ మీట్‌

Etea Rajender : ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ పక్కకు పోయింది. వేరే మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. అదే తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ విషయం. కొద్ది సేపటి క్రితం వరకు కరోనాపై సమీక్షలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపిన మంత్రి ఈటల రాజేందర్ పై ఒక్కసారిగా ఆరోపణలు వచ్చాయి. మీడియాలో వరుసగా కథనాలు ఒకేసారి ప్రసారం అయ్యాయి. మంత్రి ఈటల రాజేందర్ 100 ఎకరాల భూమిని కబ్జా చేశారని… […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :30 April 2021,10:19 pm

Etea Rajender : ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ పక్కకు పోయింది. వేరే మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. అదే తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ విషయం. కొద్ది సేపటి క్రితం వరకు కరోనాపై సమీక్షలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపిన మంత్రి ఈటల రాజేందర్ పై ఒక్కసారిగా ఆరోపణలు వచ్చాయి. మీడియాలో వరుసగా కథనాలు ఒకేసారి ప్రసారం అయ్యాయి. మంత్రి ఈటల రాజేందర్ 100 ఎకరాల భూమిని కబ్జా చేశారని… రైతులు దానిపై సీఎం కేసీఆర్ కు లేఖ రాశారని… సీఎం కేసీఆర్ వెంటనే విచారణకు ఆదేశించారని.. త్వరలోనే ఈటల మంత్ర పదవి కూడా ఊడిపోతుందని.. మీడియాలో కథనాలు వస్తున్నాయి.

telangana minister etela rajender press meet

telangana minister etela rajender press meet

దీనిపై స్పందించిన మంత్రి ఈటల రాజేందర్ వెంటనే ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై వెంటనే ప్రెస్ మీట్ లో సమాధానం చెప్పారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలన్నీ ఉత్తవేనన్నారు. అన్నీ కట్టుకథలన్నారు. తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఈటల… ఈ సందర్భంగా మాట్లాడుతూ… టీవీల్లో కావాలని ఒకేసారి తనపై కట్టుకథలు ప్రసారం చేశారని… ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఏం జరిగినా.. అంతిమంగా విజయం మాత్రం ధర్మానిదేనని ఈటల తెలిపారు.

Etela Rajender : నేను ఎవరి భూమి కబ్జా చేయలేదు.. నేను 40 ఎకరాలు కొనుక్కున్నా

నేను ఎవరి భూమిని కబ్జా చేయలేదు. 2016 లో హ్యాచరీ పెట్టడం కోసం నేను అచ్చంపల్లి దగ్గర వ్యవసాయ భూమి కాని దాన్ని కొన్నా. అసలు అక్కడ ఏం పండదు. అంతా చెట్లు, గుట్టలు. ఆ భూములకు ఎకరానికి 6 లక్షలు పెట్టి కొన్నా. ముందు 40 ఎకరాలు తీసుకున్నా. ఆ తర్వాత మరో 7 ఎకరాలు తీసుకున్నా. ఆ తర్వాత బ్యాంకు నుంచి వంద కోట్ల లోన్ తీసుకొని హ్యాచరీని డెవలప్ చేశా. ఆ భూముల్లో ఏ పంటా పండదు. దేనికీ పనికిరాని భూములు అవి. రూపాయికి కూడా అక్కరకు రావు కానీ.. నేను ఎక్కువ డబ్బులు చెల్లించి కొన్నా. ఈ విషయం సీఎం కేసీఆర్ కు కూడా తెలుసు. అన్నీ తెలిసి… నాపై ఇలా భూకబ్జా ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్. ఈటల రాజేందర్ అంటేనే నిప్పు. ఇంత నీచానికి ఒడికట్టారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారనుకోలేదు.. అని ఈటల అన్నారు.

Etela Rajender : 1986 లోనే నేను హ్యాచరీలోకి అడుగుపెట్టా

నేను ఇప్పుడు కాదు.. 1986లోనే హ్యాచరీలోకి అడుగుపెట్టా. వరంగల్ లో 1992 లోనే హ్యాచరీని అభివృద్ధి చేశా. 2004 లోనే నా దగ్గర 180 ఎకరాల భూమి ఉండేది. అంతెందుకు… 2007 లో 5 కోట్లు పెట్టి హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో 2100 గజాల స్థలం కొన్నా. కానీ.. ఆ స్థలం వివాదాల్లో ఉండటంతో దాన్నీ వదిలేసుకున్నా. నా మీద ఊరికే ఆరోపణలు చేయడం కాదు… మీడియాలో కథనాలు ప్రచారం చేయడం కాదు.. దమ్ముంటే అన్ని కమిటీలు వేసి.. విచారణ చేయించండి. నేను చావనైనా చస్తా కానీ… అవినీతి మాత్రం చేయను. ఒకవేళ నేను అవినీతి చేసినట్టు తేలితే ముక్కు నేలకు రాస్తా. చిల్లర మల్లర వాటికి లొంగిపోయే టైప్ కాదు నేను. ప్రశ్నించేటట్టే ఉంటా ఎప్పుడూ. లొంగిపోవడానికి కాదు.. అని ఈటల అన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ===> బిగ్ న్యూస్‌ : మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ఔట్..?

Etela Rajender : మంత్రి పదవి నాకు గడ్డిపోచతో సమానం

నా ఆత్మ గౌరవం ముందు… నా మంత్రి పదవి గడ్డిపోచతో సమానం. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు.. నేను ఇప్పుడు కాదు.. 20 ఏళ్ల నుంచి హుజూరాబాద్ లో గెలుస్తున్నా. నా గురించి తెలియాలంటే హుజూరాబాద్ వెళ్లి అడగండి. ధర్మం కోసం.. ప్రజల కోసం ఎప్పుడూ కొట్లాడుతా. సిట్టింగ్ జడ్జితోటి… సీబీఐ తోటి… అన్ని సంస్థలతో విచారణ జరిపించండి. దొరతనానికే నేను వ్యతిరేకంగా పోరాడినా. నాపై ఆరోపణలు వచ్చినప్పటి నుంచి బయట ఏడుస్తున్నారు.. అంటూ ఈటల రాజేందర్ భావోద్వేగానికి గురయ్యారు.

 

ఇది కూడా చ‌ద‌వండి ===> బిగ్ న్యూస్‌ : మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ఔట్..?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది