Etela Rajender : జూన్ 2న మూహూర్తం ఫిక్స్‌.. అసలు విషయాలు చెప్పేసిన ఈటల | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Etela Rajender : జూన్ 2న మూహూర్తం ఫిక్స్‌.. అసలు విషయాలు చెప్పేసిన ఈటల

 Authored By jagadesh | The Telugu News | Updated on :27 May 2021,1:10 pm

Etela Rajender : ఈటల రాజేందర్.. Etela Rajender తెలంగాణలో ప్రస్తుతం ఈయన గురించే హాట్ టాపిక్. మెదక్ జిల్లా అచ్చంపేట భూకబ్జా కేసు దగ్గర్నుంచి.. ఆయన్ను మంత్రి వర్గం నుంచి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేయడం వరకు.. అన్ని విషయాలు తెలంగాణ ప్రజలను షాక్ కు గురి చేశాయి. దశాబ్దాల నుంచి సీఎం కేసీఆర్ వెంట ఉన్న వ్యక్తి, తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తికి ఇలా జరగడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం అసలు ఈటల వ్యవహారం గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకుండా చేతల్లో చేసి చూపించారు. ఏది ఏమైనా.. ఇప్పుడు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినట్టే. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారని.. ఇప్పటికే బీజేపీ పెద్దలతో చర్చించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈటల రాజేందర్ స్వయంగా బీజేపీ చేరికపై క్లారిటీ ఇచ్చేశారు.

అదంతా ఉత్త ప్రచారమే. నేను బీజేపీలో చేరడం లేదు. నేను జన్మలో బీజేపీలో చేరను. నేను ఏ పార్టీలో చేరడం లేదు. నేను ప్రస్తుతానికి స్వతంత్రంగానే ఉండాలని అనుకుంటున్నా. అందుకే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తా. కానీ.. ఏ పార్టీ తరుపున పోటీ చేయను. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా. కాకపోతే నాకు ఇతర పార్టీల మద్దతు కావాలి. అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే నాకు వేరే పార్టీల మద్దతు కావాలి. అందుకే.. ఇతర పార్టీల నేతలను కలుస్తున్నాను. నా మీద వచ్చే ఎటువంటి పుకార్లను, ఊహాగానాలను నమ్మకండి. త్వరలోనే నా రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తా. అంటూ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Etela Rajender

Etela Rajender

Etela Rajender : ఇతర పార్టీల నేతలను ఈటల కలుస్తున్నది అందుకా?

అయితే.. గత కొన్ని రోజుల నుంచి ఈటల రాజేందర్.. ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. దానికి కారణం.. ఆయన ఆయా పార్టీల్లో చేరడం కాదు.. తాను హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తే.. తనకు మద్దతు ఇవ్వాలని.. ఆయా పార్టీలు హుజూరాబాద్ ఉపఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దించకూడదని.. అలా చేస్తేనే టీఆర్ఎస్ పార్టీని ఓడించవచ్చని ఈటల నేతలను కోరారట. అందుకే.. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా ఈటల కలిసినట్టు తెలుస్తోంది. అలాగే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత.. కొండా విశ్వేశ్వర్ రెడ్డితోనూ ఈటల భేటీ అయ్యారు. ఈటల కొత్త పార్టీ పెడుతున్నారు.. ఆ పార్టీలో చేరుతున్నారు.. ఈ పార్టీలో చేరుతున్నారు.. అనేవన్నీ ఉత్త ముచ్చట్లే అన్నమాట. మొత్తానికి తనపై వస్తున్న ఊహాగానాలకు ఈటల రాజేందర్ చెక్ పెట్టేశారు. జూన్ 2న రాజీనామాపై క్లారిటీ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది