Janasena : జనసేన పార్టీలోకి మాజీ మంత్రి.. ఇందులో నిజమెంత?
Janasena : మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి జనసేన పార్టీలో చేరుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దానికి కారణం.. ఆయన ప్రధాన పార్టీలపై గుప్పిస్తున్న విమర్శలు. అధికార పార్టీతో పాటు.. ప్రతిపక్ష పార్టీలను కూడా ఆయన వదలడం లేదు. జనసేనలో చేరేందుకే రవీంద్రారెడ్డి ఇలా విమర్శలు గుప్పిస్తున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా రవీంద్రారెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేనలో చేరి ఆ పార్టీ తరుపున పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. పేదల కోసం పోరాటం చేసేందుకు ముందుకు వచ్చే ప్రముఖ రాజకీయ పార్టీ తరుపున మాత్రమే తాను పోటీ చేస్తానని ప్రకటించడంతో ప్రస్తుతం ఆ దిశగా పయనిస్తున్న పార్టీ జనసేన అని తెలుస్తోంది. ఆయన సంచలన ప్రకటన చేయడంతో కడప జిల్లాలోని తన సొంత నియోజకవర్గం మైదుకూరులో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
Janasena : టీడీపీని కాదని జనసేనలోకి ఎందుకు వెళ్తున్నట్టు?
నిజానికి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీ తరుపున పోటీ చేయాలని అనుకున్నప్పటికీ.. టీడీపీ నుంచి టీటీడీ మాజీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ ఉండటంతో టీడీపీ తుపున పోటీ చేయడాన్ని డీఎల్ విరమించుకున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో డీఎల్.. వైసీపీకే మద్దతు ఇచ్చారు. అప్పుడు టీడీపీలో పుట్టా ఉన్నాడు. డీఎల్ వైసీపీకి మద్దతు ఇచ్చాడు. కానీ.. ఆతర్వాత వైసీపీకి మద్దతును పసంహరించుకొని వైసీపీతో విభేదాలు పెంచుకున్నాడు డీఎల్.
మైదుకూరు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న సామాజికవర్గం బలిజ. జనసేనలో ఒకవేళ తాను చేరితే బలిజ సామాజిక వర్గం నుంచి మద్దతు రావడంతో పాటు వైసీపీ, టీడీపీ అసంతృప్త వాదులు కూడా తనకు మద్దతు ఇస్తారని డీఎల్ అంచనా వేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ జనసేన కాదంటే ఇక డీఎల్ కు మిగిలిన ఆప్షన్ బీజేపీ. ఒకవేళ బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డా కూడా ఏదో ఒక పార్టీ తరుపున ఆయన పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.