Post Office Scheme : రూ.5 వేలు జమచేస్తే.. రూ.16 లక్షలు పొందొచ్చు..
Post Office Scheme : పోస్టాఫీస్‌లో ప్రజల కోసం, డబ్బులు దాచుకోవడానికి అనేక స్కీంలు అందుబాటులో ఉంటాయి. కానీ వాటి పట్ల చాలా మందికి అవగాహన ఉండదు. అందువల్ల వాటి గురించి తెలుసుకోలేరు. ఇక వీటిలో చాలా ఉపయోగపడే స్కీం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్.. దీనితో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడితే లక్షాధికారి కావచ్చు. పెట్టుబడి సైతం ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్ గా ఉంటుంది. వీటిపై పన్ను సైతం ఉండదు. నెలకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి పెట్టుకుంటూ పోతే 15 సంవత్సరాల్లో రూ.16 లక్షలు పొందొచ్చు.పీపీఎఫ్ స్కీం దీర్ఘకాలిక సందప సృష్టించుకునేందుకు మంచి స్కీం అని చెప్పొచ్చు.
మీరు పీపీఎఫ్‌లో ప్రతి నెలా రూ.5 వేల చొప్పన పెట్టుబడి పెడుతూ పోవాలి. దీని వల్ల మీ పెట్టుబడి ఏడాది రూ.60 వేలు అవుతుంది. ఇలా మీ పీపీఎఫ్ ఖాతాలో డబ్బులు జమచేసుకుంటూ పోతే 15 సంవత్సరాలు తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. అప్పుడు మీరే ఏకంగా రూ.16,27,284 పొందొచ్చు. అయితే ఇందులో మీరు పెట్టింది కేవలం రూ.9 లక్షలు కాగా, అందులో రూ.7.27 లక్షలు ఎక్కువ లాభం పొందొచ్చు. ఇందుకు వార్షిక వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంటుంది. పీపీఎఫ్ లో కాంపౌండింగ్ వార్షిక ప్రతిపాదన జరుగుతుంది.

excellent scheme in the post office
Post Office Scheme : అధిక వడ్డీ రేటు
త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ రేట్లను ప్రభుత్వం మారుస్తుంది. దీని మెచ్యూరిటీ టైం 15 సంవత్సరాలు కాగా.. దీనిని మీరు మరో ఐదేండ్ల వరకు పెంచుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద దీనికి పన్ను ప్రయోజనాలు సైతం ఉంటాయి. ఇందులోంచి రుణం సైతం పొందే అవకాశం ఉంటుంది. ఖాతా తెరిచిన ఏడాది నుంచి ఐదేండ్ల లోపు లోన్ తీసుకునేందుకు చాన్స్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీకు దగ్గర్లో ఉన్న పోస్టాఫీస్ కు వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోండి మరి.