Salt : ఎక్కువగా ఉప్పు తింటున్నారా? అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Salt : ఎక్కువగా ఉప్పు తింటున్నారా? అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే?

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 March 2021,12:30 pm

Salt : అన్నేసి చూడు.. నన్నేసి చూడు.. అంటుందట ఉప్పు. ఎందుకంటే.. కూరల్లో ఉప్పే ప్రధానం. ఉప్పు లేని కూరను ఎవ్వరూ తినలేరు. ఉప్పు లేకపోయినా.. ఉప్పు ఎక్కువైనా కూడా ముద్ద దిగదు. ఉప్పుకు కూరల్లో ఉన్న ప్రాధాన్యత అంత ఉంటుంది. కారం ఎక్కువైనా.. పసుపు ఎక్కువైనా.. తక్కువైనా ఎలాగోలా తినేయొచ్చు కానీ.. ఉప్పు లేకపోతే వెంటనే ఉప్పు చల్లుకొని మరీ తినేస్తాం. అది ఉప్పుకు ఉన్న ప్రాముఖ్యత.

excess use of slat is more dangerous to health

excess use of slat is more dangerous to health

అయితే.. చాలామందికి ఏ ఉప్పు వాడాలో తెలియదు. రోజుకు ఎంత వాడాలో కూడా తెలియదు. మన శరీరానికి అవసరమైన ఉప్పును వాడకపోవడం వల్ల.. ఏ ఉప్పు వాడాలో తెలియకపోవడం వల్ల.. ఎక్కువ మోతాదులో వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

నిజానికి.. మన శరీరానికి ఉప్పు ఎంతో అవసరం. కానీ.. దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఉప్పులో సోడియం, క్లోరైడ్ ఉంటాయి. వీటి వల్ల నరాల పనితీరు మెరుగుపడుతుంది. కణాల్లో, రక్తంలో ఉండే నీటి శాతాన్ని ఉప్పు నియంత్రిస్తుంది.

Salt : రోజూ 6 గ్రాముల ఉప్పు తింటే చాలు

కాకపోతే.. రోజూ 6 గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు. 6 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును రోజూ తీసుకుంటే.. శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. దాని వల్ల కాళ్లు, చేతుల్లో వాపు వస్తుంది. బీపీ పెరుగుతుంది.

ఒకవేళ ఉప్పును ఎక్కువగా కొన్నేళ్ల పాటు తీసుకుంటే.. జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. హైబీపీతో పాటు.. గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

అలాగని.. ఉప్పును పూర్తిగా మానేసినా కూడా సమస్యే. అందుకే.. రోజుకు కనీసం 6 గ్రాముల ఉప్పును మీ ఆహారంలో భాగం చేసుకోండి.

Salt : ఏ ఉప్పు తినాలి?

సాధారణంగా.. ఎక్కువ మంది మార్కెట్ లో దొరికే అయోడైజ్డ్ సాల్ట్ ను వాడుతుంటారు. కానీ.. అది ఆర్టిఫిషియల్ గా అయోడిన్ కలిపిన ఉప్పు. అలాగే.. అది ప్రాసెస్ చేసిన ఉప్పు. ఆ ఉప్పు తినడం వల్ల ఉన్న రోగాలు పోయి.. వేరే రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.

అందుకే.. ఎక్కువ శాతం.. సముద్రపు ఉప్పు, గళ్ల ఉప్పు, రాళ్ల ఉప్పును వాడటం మంచిది. వాటిలో సహజసిద్ధంగా అయోడిన్ ఉంటుంది.

అలాగే సైంధవ లవణాన్ని కూడా కూరల్లో వేసుకోవడానికి వాడుకోవచ్చు. కానీ.. అయోడైజ్డ్ ఉప్పు పేరుతో అమ్మేవాటిని తినడం వల్ల లేనిపోని సమస్యలను అయితే కొని తెచ్చుకున్నట్టే.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది