Pawan Kalyan | ‘ఓజీ’ ప్రీమియర్ షోలో హంగామా.. థియేటర్ స్క్రీన్ చింపివేత, షో రద్దు
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’ సినిమా నేడు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే బెంగళూరులోని కేఆర్ పురం (K.R. Puram) ప్రాంతంలోని థియేటర్‌లో ఊహించని హంగామాకు దారి తీసింది.

#image_title
రెచ్చగొట్టే ప్రవర్తన
బుధవారం సాయంత్రం ‘ఓజీ’ ప్రీమియర్ షో ప్రారంభమైన తర్వాత అభిమానులు భారీగా థియేటర్‌కి తరలివచ్చారు. మొదట నినాదాలతో ఉత్సాహంగా ప్రారంభమైన వేడుకలు, క్రమంగా వీరంగానికి దారితీశాయి. కొందరు అభిమానులు తెర ముందుకు వెళ్లి, కత్తితో స్క్రీన్‌ను చింపేశారు. ఈ చర్యతో స్క్రీన్‌పై భారీ పగుళ్లు రావడంతో, షోను తక్షణమే యాజమాన్యం నిలిపివేసింది.
ఘటనపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేక్షకుల సురక్షితాన్ని దృష్టిలో ఉంచుకుని షో రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. షో రద్దవడంతో అక్కడికి ప్రత్యేకంగా వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇలాంటి చర్యలు పైగా పెద్ద హీరోల సినిమాల సమయంలో జరుగుతుండటం పట్ల సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.‘‘అభిమానం ఒక వరకు బాగుంది, కానీ ఆస్తి నష్టం చేయడం సరైంది కాదు.ఇలాంటివి పునరావృతమైతే థియేటర్లు ప్రీమియర్ షోలకు ముందుకు రావడం మానేస్తాయి
అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.