Fetus in Womb : షాకింగ్.. తల్లి గర్భంలో ఉండగానే.. గర్భం దాల్చిన శిశువు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fetus in Womb : షాకింగ్.. తల్లి గర్భంలో ఉండగానే.. గర్భం దాల్చిన శిశువు

 Authored By jagadesh | The Telugu News | Updated on :31 July 2021,8:45 pm

Fetus in Womb : అసలు ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మనుషులకు అందని కొన్ని వింతలు కూడా చోటు చేసుకుంటాయి. ఆ వింతలను చూసి మనం నోరెళ్లబెట్టడం తప్పించి చేసేదేం ఉండదు. ఈ భూమ్మీద ఎన్నో వింతలు, విశేషాలు.. వాటన్నింటిని మనం చూస్తూ ఆశ్చర్యపోవడం.. ఇప్పుడే కాదు.. ఎన్నో శతాబ్దాల నుంచి ఇది జరుగుతోంది. బ్రహ్మం గారు చెప్పినట్టు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సరే.. కొన్ని వింతలు విచిత్రంగా ఉన్నా.. తాజాగా జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టడం తప్పంచి ఇంకేం చేయలేం.

fetus pregnant in mother womb trending news telugu

fetus pregnant in mother womb trending news telugu

అయితే.. ఇది వైద్యరంగానికే సవాల్ విసిరిన వింత. వైద్యరంగంలోనే ఇప్పటి వరకు ఇటువంటి వింత జరగలేదు. పేరు మోసిన డాక్టర్లే ఆ వింతను చూసి షాక్ అవుతున్నారు. ఇలాంటిది జరగడం ఇదే మొదటి సారి కాబట్టి.. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Fetus in Womb : తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన ఆడ శిశువు

తల్లి గర్భంలో ఉన్నే ఆడ శిశువు గర్భం దాల్చడమే ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తున్న విషయం. ఈ ఘటన ఇజ్రాయిల్ లో చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ కు చెందిన ఓ మహిళ ఇటీవల.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. ఆమె గర్భిణీగా ఉన్న సమయంలో.. ఆడ బిడ్డకు జన్మనివ్వకముందే.. ఆల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు. అప్పుడు వైద్యులు ఒక అరుదైన విషయాన్ని గమనించారు. సాధారణంగా గర్భంలో ఉండే శిశువు పొట్ట సమానంగా ఉంటుంది. కానీ.. ఈ పిండం పొట్ట కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నట్టు గమనించారు. అయితే.. శిశువు తల్లి గర్భంలో ఉండటంతో తన లోప ఏముందో మాత్రం తెలుసుకోలేకపోయారు వైద్యులు.

ఆ మహిళ.. డెలివరీ అయ్యాక.. ఆ శిశువుకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆ శిశువు కడుపులో మరికొన్ని పిండాలు ఉన్నట్టు తెలుసుకున్నారు డాక్టర్లు. దీంతో వైద్యులు షాక్ అయ్యారు. వెంటనే ఆ శిశువుకు సర్జరీ చేసి ఆ పిండాలను తీసేసి.. తన ప్రాణాలను నిలబెట్టారు.

Also read

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది