Flowers : చంద్రకాంతితో వికసించే పూల గురించి తెలుసా.. ఐతే ఇది చూడండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Flowers : చంద్రకాంతితో వికసించే పూల గురించి తెలుసా.. ఐతే ఇది చూడండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :31 October 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Flowers : చంద్రకాంతితో వికసించే పూల గురించి తెలుసా.. ఐతే ఇది చూడండి..!

Flowers : సూర్య కిరణాలు మొగ్గల మీద పడినప్పుడే అవి వికసిస్తాయని తెలిసిందే. మొగ్గ పువ్వుగా మారాలంటే సూర్య కాంతి కంపల్సరీ ఐతే సృష్టిలో దాదాపు అన్ని పూలు సూర్య కాంతితోనే వికసిస్తాయి కానీ చంద్రుడి కాంతితో కూడా వికసించే పూలు కూడా ఉన్నాయి. అవేంటన్నది మీకు తెలుసా. ఈ మొక్కలపై మొగ్గలు పగటిపూట మూసి ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ రాత్రి పూట మాత్రం అవి వికసించి ఉంటాయి. ప్రపంచంలో అన్ని పువ్వుల కన్నా ఇవి విరుద్ధంగా ఉంటాయి. ఇంతకీ చంద్రకాంతితో పూసే పువ్వులు ఏంటని అనుకోవచ్చు వాటిని నైట్ లైట్స్ అని అంటారు. ఈ పువ్వులు చాలా రకాల జీవ పర్యావరణ కారకాలచేత ప్రభావితం అవుతాయి. రాత్రి పూసే ఈ పువ్వుల జీవిత చక్రం రాత్రి సమయానికి అనుగుణంగానే ఏర్పడుతుంది. ఈ పువ్వుల తేమ, కాంతి స్థాయిని పట్టి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఫోటో పెరియోడిజం అంటే ఇది ఒక జీవ ప్రక్రియ. దీని వల్ల మొక్కలు వివిధ స్థాయిల కాంతికి ప్రతిస్పందన చెందుతాయి. రాత్రిపూట వికసించే పువ్వుల ఉద్దేశ్యం పరాగ సంపర్కం. ఈ పువ్వుల సువాసన రంగు ఆత్రి చీకటిలో ప్రభావితం చేస్తాయి.

Flowers నైట్ క్వీన్ పువ్వు..

ఇక రాత్రి పూసే పువ్వుల గురించి మరింత తెలుసుకుంటే.. నైట్ క్వీన్ పువ్వు రాత్రి వికసించే అందమైన పువ్వు. ఈ పువ్వు తెల్లటి మొగ్గలు రాత్రి పూట వికసిస్తాయి. ఇక వీటితో పాటు మల్లెపూలు కూడా రాత్రి పూట వికసిస్తాయి. నైట్ క్వీన్ లానే ఇవి కూడా చాలా సువాసన కలిగి ఉటాయి. ఐతే జాస్మిన్ పూలు రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి కింగ్ జాస్మిన్ మరోటి సాంబాక్ జాస్మిన్ అని ఉంటాయి.

Flowers చంద్రకాంతితో వికసించే పూల గురించి తెలుసా ఐతే ఇది చూడండి

Flowers : చంద్రకాంతితో వికసించే పూల గురించి తెలుసా.. ఐతే ఇది చూడండి..!

వీటితో పాటే రాత్రి పూసే పూలు సరెన్.. ఈ మొక్క రాత్రి పూట పూలు పూస్తుంది. ఈ పూలు చాలా పెద్దగా ఉంటాయి. ఇవి కూడా రాత్రి మాత్రమే వికసిస్తాయి. వీటి సువాసన కూడా చాలా బాగుంటుంది. నైట్ వికసించే పూలలో ట్రంపెట్ వైన్ ఫ్లవర్ ఉంటుంది. ఇవి రాత్రి పూట వికసిస్తయి. వీటి ఆకారం సిలిండర్ లాగా ఉంటుంది. రాత్రి తేనెటీగలు, కీటకాలని ఈ పువ్వు ఆకర్షిస్తుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది