Flowers In Hair : ఆడవాళ్లు తలలో పూలు పెట్టుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా… తప్పక తెలుసుకోండి…!
ప్రధానాంశాలు:
Flowers In Hair : ఆడవాళ్లు తలలో పూలు పెట్టుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా... తప్పక తెలుసుకోండి...!
Flowers In Hair : సహజంగానే అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఇక వారి అందానికి తలలో పూలు పెడితే మరింత అందంగా కనిపిస్తారు. తలలో ఉండే పువ్వు వారి ముఖంలోని సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. అయితే పూర్వం ప్రతిరోజు ఆడపిల్లలు తలలో పూలు పెట్టుకునేవారు. కానీ ప్రస్తుతం ఫ్యాషన్ మోజులో చాలామంది పూలు పెట్టుకోవడమే మానేశారు. మరి కొంతమంది అయితే ఏకంగా జుట్టు కూడా ఉంచుకోవడం లేదు. కానీ ఇప్పటికీ కొంతమంది అమ్మాయిలు మాత్రం తలలో పూలు పెట్టుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ విధంగా తలలో పూలు పెట్టుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. తలలో పూలు పెట్టుకోవడం వలన అందాన్ని రెట్టింపు చేసుకోవడంతో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా పొందవచ్చని చెబుతున్నారు. మరి ప్రతిరోజు తలలో పూలు పెట్టుకోవడం వలన జరిగే ప్రయోజనాలు ఏంటి.. ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
కాలానికి అనుగుణంగా మనుషులు మారుతూ వస్తున్నారు. అయితే పూర్వం ఆడపిల్లలు జుట్టుకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రతిరోజు నూనె రాసి తల దువ్వి చక్కగా జడ అల్లుకుని పూలతో అలంకరించుకునేవారు. కానీ ప్రస్తుతం మారిన టెక్నాలజీ యుగంలో అమ్మాయిలు జడ వేసుకోవడమే మానేశారు. ఇక ప్రస్తుతం చాలామంది జుట్టు విరబోసుకొని తిరుగుతున్నారు. కొన్ని సందర్భాలలో కూడా తలలో పూలు పెట్టుకోవడం లేదు. అయితే జడ వేసుకోకుండా బదులుగా జుట్టును వదిలేస్తే అందంగా కనిపించినప్పటికీ ఆరోగ్యానికి అది అసలు మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా అని జుట్టును గట్టిగా అల్లడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదట. జుట్టును జడ వేసుకున్న లేదా వదిలేసిన పువ్వు పెట్టుకుంటేనే బాగుంటుందని చెబుతున్నారు. అలాగే జడలో పూలు పెట్టుకోవడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
Flowers In Hair గులాబీ
గులాబీ పువ్వు ను ప్రేమకు చిహ్నంగా చూపిస్తారు. అయితే ప్రతిరోజు గులాబీ పూవ్వును జడలో పెట్టుకోవడం వలన దానిలోని సువాసన తల బారాన్ని తగ్గిస్తుందట. అంతేకాక తల తిరగడం వంటి సమస్యలను కూడా నివారిస్తుందని చెబుతున్నారు.
Flowers In Hair మల్లెపూలు…
మల్లెపువ్వు అనేది శ్రేయస్సుకు అదృష్టానికి చిహ్నంగా పేర్కొనబడింది. అయితే కొంతమందికి వీటి వాసన వలన తలనొప్పి వస్తుంది. కానీ మల్లెపూలు పెట్టుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందట. మానసిక ఒత్తిడి తగ్గి మనశ్శాంతి కలుగుతుంది. అయితే చాలామందికి మల్లెపూల వాసన కారణంగా శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటివారు ఇతర పూలను పెట్టుకోవడం మంచిది.
చామంతి : ఈ చామంతి పూలు సంతోషానికి చిహ్నం అని చెప్పవచ్చు. కాబట్టి అమ్మాయిలు తలలో చామంతిని ధరిస్తే వారి జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మందార : మందార పువ్వును ఎక్కువగా శక్తికి రూపమైన కాళీమాతను పూజించేందుకు ఉపయోగిస్తారు. అందుకే ఈ మందార పువ్వు శక్తికి చిహ్నంగా పేర్కొనడం జరిగింది. కావున మందార పువ్వును తలలో పెట్టుకుంటే మేలు జరుగుతుంది.
బంతిపూలు : గ్రామాల్లోని ప్రతి ఇంట్లో బంతి చెట్టు తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాక ఈ పువ్వుకు సువాసన కూడా ఉండదు. కావున తలనొప్పి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాబ్బటి తలనొప్పి ఎక్కువగా వచ్చేవారు ఈ పూలను పెట్టుకోవడం మంచిది. ఈ విధంగా ప్రతిరోజు తలలో పువ్వు పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంతవరకు తలలో పూలు పెట్టుకోవడం అలవాటు చేసుకోండి.