Money Save : గ్యాస్ సిలిండర్‌పై డబ్బులను ఇలా ఆదా చేసుకోండి..
Money Save : రోజురోజుకూ నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడటం చూసి భయపడిపోతున్నారు. ప్రభుత్వాలు సిలిండర్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డీ విరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిలిండర్ ధరల భారాన్ని సుమారు నాలుగొందల రూపాయల వరకు తగ్గించుకోవచ్చు. అందుకుగాను మీరు ఆ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.ఎల్‌పీజీ గ్యాస్ ను ప్రస్తుతం ప్రతీ ఒక్కరు తమ ఇళ్లలో ఉపయోగిస్తున్నారు.
కొందరు అయితే రెండు సిలిండర్లు మెయింటేన్ చేస్తున్నారు. ఒక సిలిండర్ అయిపోగానే మరో సిలిండర్ యూజ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు. కేంద్రప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచుకుంటు పోతున్న నేపథ్యంలో ఒకప్పుడు రూ.500గా ఉన్న ధర ఇప్పడు రూ.1,000కి చేరింది. అలా సామాన్యుడికి సిలిండర్ వినియోగం భారంగా మారుతున్నది. అయితే, ఈ భారాన్ని కొంత మేరకు అనగా సుమారు రూ.400 వరకు ఇలా తగ్గించుకోవచ్చు. ఎలాగంటే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కు బదులుగా పీఎన్ జీ గ్యాస్ యూసేజ్ ద్వారా.. అనగా పైప్డ్ నేచురల్ గ్యాస్ ఉపయోగిస్తే ధరల భారం తగ్గుతుంది.ఎల్ పీజీ సిలిండర్ 14.2 కేజీల ధర ప్రస్తుతం సుమారు రూ.950 వద్ద ఉంది.
Money Save : ఇలా చేస్తే చాలు..దాదాపు రూ.400 ఆదా..
అనగా ఈ గ్యాస్ ధర సుమారు కేజీకి రూ.66.90 పడుతుంది. అయితే, పీఎన్ జీ గ్యాస్ ధర మాత్రం కొంచెం తక్కువగానే ఉంది. స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు రూ.35.61గా ఉంది. అలా క్యూబిక్ మీటర్స్‌ను కిలోగ్రామ్‌లోకి మార్చుకుంటే.. కనుక కేజీకి రూ.41 అవుతుంది. అలా మొత్తంగా 14.2 కేజీలకు రూ.580 అవుతుంది. అదే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.950. అలా మీకు సుమారుగా రూ.400 వరకు ఆదా అవుతుంది. ఎగ్జాక్ట్‌గా అయితే రూ.370 సేవ్ అవుతుంది. కేంద్రప్రభుత్వం ఈ పీఎన్‌జీ గ్యాస్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.