Oxygen Levels : కరోనా టైమ్ లో ఆక్సిజన్ లేవల్స్ ను పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ ఫుడ్ తినాల్సిందే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Oxygen Levels : కరోనా టైమ్ లో ఆక్సిజన్ లేవల్స్ ను పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ ఫుడ్ తినాల్సిందే?

Oxygen Levels : ప్రస్తుతం కరోనా దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. తన తడాఖాను చూపిస్తోంది. మన కంటికి కనిపించని ఒక వైరస్ తో మనం పోరాడుతున్నాం. కరోనా వైరస్ ధాటికి దేశమంతా అల్లాడుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనాయే. రోజురోజుకూ కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతూ పోతోంది. ఏ ఆసుపత్రి చూసినా కరోనా పేషెంట్లతో నిండిపోతోంది. బయట కాలు అడుగుపెడదామంటే కరోనా వైరస్ భయం. ఎక్కడి నుంచి వైరస్ వచ్చి అంటుకుంటుందోనని భయం. ఇలాంటి పరిస్థితుల మధ్య […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :30 April 2021,8:30 pm

Oxygen Levels : ప్రస్తుతం కరోనా దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. తన తడాఖాను చూపిస్తోంది. మన కంటికి కనిపించని ఒక వైరస్ తో మనం పోరాడుతున్నాం. కరోనా వైరస్ ధాటికి దేశమంతా అల్లాడుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనాయే. రోజురోజుకూ కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతూ పోతోంది. ఏ ఆసుపత్రి చూసినా కరోనా పేషెంట్లతో నిండిపోతోంది. బయట కాలు అడుగుపెడదామంటే కరోనా వైరస్ భయం. ఎక్కడి నుంచి వైరస్ వచ్చి అంటుకుంటుందోనని భయం. ఇలాంటి పరిస్థితుల మధ్య దేశంలోని ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. అందుకే… కరోనా వైరస్ ను మన దరికి చేరకుండా ఉంచాలంటే.. కరోనాను తరిమి తరిమి కొట్టాలంటే.. శరీరంలో ఆక్సిజన్ లేవల్స్ ను పెంచుకొని ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేకుండా చేసుకోవాలంటే… ఈ ఆహారాన్ని కనీసం కరోనా వ్యాప్తి ఉన్నన్ని రోజులైనా ఖచ్చితంగా రోజూ తినాల్సిందే. ఆ ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

foods which increase oxygen levels in the body

foods which increase oxygen levels in the body

Oxygen Levels : ఈ పండ్లు మీ ఇంట్లో ఉంటే.. మీ ఆక్సిజన్ లేవల్స్ పెరిగినట్టే

కరోనా వచ్చి ఆక్సిజన్ లేవల్స్ పడిపోయి… శ్వాస అందక చాలామంది మృత్యువాత పడుతున్నారు. అటువంటి వాళ్లు ముందే జాగ్రత్త పడి శరీరంలో ఆక్సిజన్ లేవల్స్ ను పెంచుకుంటే కరోనా వచ్చినా శ్వాసకు సంబంధించిన సమస్యలు రావు. అందుకే శరీరంలో ఆక్సిజన్ లేవల్స్ ను పెంచుకోవాలంటే కివి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. కివి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే… చాలా పోషకాలు శరీరంలో ఉంటాయి. ఇవి శరీరంలోని ఆక్సిజన్ లేవల్స్ ను విపరీతంగా పెంచుతాయి.

foods which increase oxygen levels in the body

foods which increase oxygen levels in the body

Oxygen Levels : చిలగడదుంప, కీర దోస, నిమ్మకాయను రోజూ తీసుకోవాల్సిందే

కివి పండుతో పాటు.. చిలగడదుంపను కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. చిలగడదుంపనే కందగడ్డ అని కూడా అంటారు. దీనిలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. చిలగడదుంప ఆక్సిజన్ లేవల్స్ ను ఒక్కసారిగా పెంచుతుంది. అలాగే.. కీర దోస కూడా ఆక్సిజన్ లేవల్స్ ను పెంచుతుంది. కీరదోశలో ఉండే.. పోషకాలు, వాటర్ శాతం రక్తంలో పడిపోయిన ఆక్సిజన్ లేవల్స్ ను ఒక్కసారిగా పెంచుతాయి. అలాగే.. నిమ్మకాయ కూడా అంతే. నిమ్మకాయలో ఎన్ని సుగుణాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిమ్మకాయను ప్రతిరోజూ తీసుకోవాల్సిందే. ప్రతి రోజూ ఉదయాన్నే కాసిన్ని గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం పిండి… కాస్త తేనె కలుపుకొని తాగితే ఎంతో మంచిది. శరీరంలో ఆక్సిజన్ లేవల్స్ కూడా ఒక్కసారిగా పెరుగుతాయి.

foods which increase oxygen levels in the body

foods which increase oxygen levels in the body

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది