నాలుగేళ్ల ప్రేమలో ప్రియుడికి మొత్తం అర్పించేసింది.. చివరికి యువతీ ట్విస్ట్..!!
ప్రస్తుత సమాజంలో మోసం అనేది బాగా ఏలుబడి చేస్తున్న సంగతి తెలిసిందే. అది ఇంటి బయట అయినా సరే ఇంటిలో తోడబుట్టిన వాలైనా సరే లాభం కోసం ఎదుటి వ్యక్తిని… ఏం చేయడానికైనా వెనుకాడని రోజులలో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. అవసరం తీరిపోతే చాలు ఎదుట వ్యక్తిని.. కూరలో కరేపాకు మాదిరిగా తీసి పారేస్తున్న సమాజం. ఇదిలా ఉంటే ప్రేమ పేరుతో నాలుగేళ్లు ప్రేమించిన యువకుడు యువతని అన్ని రకాలుగా అనుభవించి చివరాఖరికి మోజు తీరాక అతి కిరాతకంగా చంపేశాడు.మైసూర్ నగరంలో కేఆర్ నగర్ లో డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న నిసర్గ అనే యువతి.. తన ఇంటర్ సెకండియర్ సుహాస్ రెడ్డి అనే యువకుడితో ప్రేమలో పడటం జరిగింది.
నిసర్గనీ ప్రేమ పేరుతో మాటలు అన్ని రకాలుగా నమ్మించి చెప్పి.. చక్కగా అన్నీ అవసరాలు తీర్చేసుకున్నాడు. నిసర్గ తో మౌజి కాస్త తిరిగాక సుహాస్ మోజు కాస్త తిరిగాక మరో యువతీతో కలిసి తిరగటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో నిసర్గ ఫోన్ చేసినా గాని కట్ చేయటం మొదలుపెట్టాడు. ఓ రోజు వేరే యువతీతో సుహాస్ బైకు మీద తిరుగుతూ నిసర్గ కంటిలో పడ్డాడు. ఆ తరువాత అన్ని నిసర్గాకు సుహాస్ చేస్తున్న డబల్ గేమ్ అర్థం అయింది. తనని సుహాస్ మోసం చేశాడని తెలుసుకొంది. ఎంతో గాఢంగా ప్రేమించిన నిసర్గ తట్టుకోలేక సుహాస్ ఇంటికి వెళ్లి.. అతనితో ఉన్న బంధాలు గురించి అన్నిటినీ ఆధారాలతో సహా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరినీ కలిపి పెళ్లి చేయాలని సుహాస్ తల్లిదండ్రులను బతిమాలాడింది. ఈ క్రమంలో సుహాస్ తల్లిదండ్రులు మా ఆస్తి కోసం కుర్రోడిని వలలో వేసుకున్నావా అని నిసర్గాని విమర్శించడం జరిగింది.
ఈ క్రమంలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక నిసర్గ బలవన్మరణానికి పాల్పడి ఆత్మహత్య చేసుకుంది. తాను చనిపోవడానికి ముందు నిసర్గ ఓ లెటర్ రాయడం జరిగింది. తన చావుకి కారణమైన సుహాస్..తో పాటు అతని తల్లిదండ్రులను కూడా శిక్షించాలని ఉత్తరంలో పోలీసులను వేడుకొంది. ఈ ఘటన కర్ణాటకలో సంచలనం సృష్టించింది.