Fry Piece Chicken Biryani : రెస్టారెంట్ స్టైల్ లో ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
Fry Piece Chicken Biryani : బిర్యానీ.. ఈ పేరు వింటే చాలు చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. ఎవరైనా గుర్తు చేసినా, వారికి ఎక్కువగా ఆకలి వేసినా వెంటనే రెస్టారెంట్ కి వెళ్లి ఏ చికెన్ బిర్యానీయో, మటన్ బిర్యానీయో లాగించేస్తుంటారు. అయితే తరచుగా బిర్యానీలను బయట తినాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే చాలా డబ్బులు కావాలి. అలాగే బయట ఫుడ్ అంత మంచిది కాదు కాబట్టి. అయితే కాస్త సమయం కేటాయిస్తే చాలు ఇంట్లోనే మాంచి చికెన్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. అయితే మామూలు బిర్యానీ కాదండోయ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. అయితే రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలనో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా కావాల్సిన పదార్థాలు..
అర కిలో చికెన్, బాస్మతీ బియ్యం – 1 కిలో, ఉల్లిపాయలు -250 గ్రాములు , అల్లం వెల్లుల్లి ముద్ద – 3 టీ స్పూన్, కొత్తిమిర – 1/2 కప్పు, పుదీన- 1/2 కప్పు, పచ్చిమిర్చి – 3, పసుపు – తగినంత, కారం పొడి – 2 టీ స్పూన్, ఏలకులు – 4, లవంగాలు – 8, దాల్చిన – 2, షాజీర – 2 టీ స్పూన్, గరం మసాలా పొడి – 2 టీ స్పూన్, కేసర్ రంగు – 1/4 టీ స్పూన్, నెయ్యి – 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె – తగినంత.అయితే ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లంవగాలు, ఎలకులు, బిర్యానీ ఆకు, షాజీర వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి మిర్చి, వేయించిన ఉల్లిపాయలు వేస్కోవాలి. ఆ తర్వాత కసూరీ మేతి, కరివేపాకు, నెయ్యి వేస్కోవాలి. అదంతా బాగా కలిపి వేయించాకా బియ్యంకి సరిపడా నీళ్లు పోస్కోవాలి. అది ఒక పొంగు వచ్చాక గరం మసాలా, దనియాల పొడి ఉప్పు వేస్కోవాలి. అటు పిమ్మట కొత్తిమీర, పుదీన అలాగే అరగంట సేపు నానబెట్టిన బాస్మతీ రైస్ వేస్కోవాలి.
బాగా కలిపి మూత పెట్టేయాలి.అది ఉడికాక.. పైన నెయ్యి, ఫుడ్ కలర్, వేయించిన ఉల్లిపాయలు, పదీన, కొత్తిమీర, కాజూ వేస్కోవాలి. ఆ తర్వాత ఇందులో వేసేందుకు ఫ్రై చికెన్ తయారు చేస్కుందాం. ముందుగా నీళ్లు తీస్కొని కాస్త పసుపు వేసి చికెన్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ఓ బాణాలి పెట్టి నూనె వేస్కోవాలి. కాస్త నూనె వేడెక్కగానే సాజీరా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్దు, పసుపు వేయాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, దనియాల పొడి వేస్కోని చివరగా చికెన్ వేస్కోవాలి. అదంతా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత కాస్త పుదీనా, కొత్తిమీర వేస్కోని దింపేయాలి. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేస్కొని పెట్టుకున్న బిర్యానీపై ఈ చికెన్ ఫ్రై వేస్కోని సర్వింగ్ బౌల్ లోకి తీస్కోవాలి. అంతే రుచికరమైన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ.