Ganesh Chaturthi : మొదటిసారిగా గణేషుడిని ఎవరు స్థాపించారు తెలుసా… నిమజ్జనం ఇలా చేసేవారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ganesh Chaturthi : మొదటిసారిగా గణేషుడిని ఎవరు స్థాపించారు తెలుసా… నిమజ్జనం ఇలా చేసేవారు…

Ganesh Chaturthi : దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తులందరూ 10 రోజులు పూజలు చేసి గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. గణపతి బప్పా మోరియా అంటూ, అందంగా అలంకరించిన వాహనాలపై గణపతి విగ్రహాన్ని పెట్టి, ఊరేగిస్తూ గంగమ్మ ఒడికి చేరుస్తారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో గణేషుడికి సంబంధించి ఒక ఫోటో వైరల్ అవుతుంది. గణేష్ చతుర్థి పండుగ ఒక పర్వదినంగా మారటానికి ముందు ఈ వేడుకను ఎలా నిర్వహించారు ఎలా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 September 2022,6:00 am

Ganesh Chaturthi : దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తులందరూ 10 రోజులు పూజలు చేసి గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. గణపతి బప్పా మోరియా అంటూ, అందంగా అలంకరించిన వాహనాలపై గణపతి విగ్రహాన్ని పెట్టి, ఊరేగిస్తూ గంగమ్మ ఒడికి చేరుస్తారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో గణేషుడికి సంబంధించి ఒక ఫోటో వైరల్ అవుతుంది. గణేష్ చతుర్థి పండుగ ఒక పర్వదినంగా మారటానికి ముందు ఈ వేడుకను ఎలా నిర్వహించారు ఎలా ఊరేగిస్తూ నిమజ్జనం చేశారో ఈ ఫోటోలో కనిపిస్తుంది. ఈ వినాయక చవితిని మహారాష్ట్రలో గుర్తించారు. చత్రపతి శివాజీ మహారాజు కాలం నుండి వినాయక చతుర్థి సాంప్రదాయంగా పూణేలో జరుపుకున్నారు.

గణేశుడు పేష్వాల కులదేవత. వారి పతనంతో పండుగ రాష్ట్ర ప్రోత్సాహాన్ని కోల్పోయింది. ఆ తర్వాత మహారాష్ట్రలో ఒక ప్రైవేట్ కుటుంబ వేడుకగా మారింది. అయితే స్వతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త లోకమాన్య తిలక్ వినాయక చవితి వేడుకలను పునరుద్దించారు. వినాయకుడు పండుగను మండపాలను ఏర్పాటు చేసి జరుపుకునే విధానం 1892లో ప్రవేశపెట్టబడింది. కృష్ణ జిపాంత్ అనే పూణే నివాసి మరాఠీ పాలనలో ఉన్న గ్వాలియర్ ను సందర్శించినప్పుడు అక్కడ అతను సాంప్రదాయ వేడుకను చూసి తన స్నేహితులైన బహుసాహెబ్, లక్ష్మణ్ జావలే బాల సాహెబ్ వారికి చెప్పాడు. జావలే దీనిని అనుసరించి మొదటిసారి వీధిలో మండపాని ఏర్పాటు చేసి గణేశుడి విగ్రహాన్ని స్థాపించారు.

Ganesh chaturthi procession first start in Mumbai in 1948

Ganesh chaturthi procession first start in Mumbai in 1948

లోకమాన్య తిలక్ 1893లో తన వార్తాపత్రిక కేసరిలో ఒక వ్యాసంలో జావలే కృషిని ప్రశంసించారు. తర్వాత సంవత్సరం వార్త ఆఫీసులో గణేషుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. వినాయకుడి భారీ విగ్రహాలను మండపాలలో ప్రతిష్టించిన మొదటి వ్యక్తి తిలక్, అనంతరం పూజను నిర్వహించి పదవ రోజున విగ్రహాలను నదులు లేదా సముద్రం వంటి వాటిల్లో నిమజ్జనం చేసే పద్ధతిని స్థాపించారు. గణేష్ చతుర్థి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అన్ని కులాల వర్గాల ప్రజల సమావేశ స్థలంగా మారింది. ఈ ఉత్సవం ఉపన్యాసం కవిత పఠనాలు, నాటకాలు, కచేరీలు, జానపద నృత్యాల రూపాలు సమాజ భాగస్వామ్యాన్ని సులభతరం చేసింది. లోకమాన్య తిలక్ వినాయకుడి విజ్ఞప్తిని దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేశారు. అందరికీ దేవుడిగా గణేష్ చతుర్థిని జాతీయ పండుగగా ప్రాచుర్యం పొందింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది