Ganta Srinivasa Rao : పార్టీ మార్పుపై ఫుల్లు క్లారిటీ ఇచ్చేసిన గంటా శ్రీనివాసరావు.. ఇక రూమర్స్ కు చెక్
Ganta Srinivasa Rao : ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు మొత్తం వైజాగ్ చుట్టే తిరుగుతున్నాయి. దానికి కారణం.. వైజాగ్ ను ఏపీ పరిపాలన రాజధానిగా చేయడం. ఏపీ ప్రభుత్వం ఎప్పుడైతే మూడు రాజధానులను ప్రకటించిందో.. అందులో వైజాగ్ పేరు ఉండటంతో ఒక్కసారిగా వైజాగ్ రాజకీయాలే ఏపీలో కేంద్రం అయ్యాయి. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా చాలా రోజుల నుంచి వైజాగ్ రాజకీయాల్లో వినిపిస్తోంది. దానికి కారణం.. వైజాగ్ లో ఆయనకు ఉన్న పరపతి. ఆయనకు వైజాగ్ లో చాలా ఫాలోయింగ్ ఉంది.
అందుకే ఆయన గురించే ఎక్కువగా రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. అయితే.. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఏం బాగోలేదు అనే విషయం తెలుసు కదా. అందుకే.. ఆయన పార్టీ మారుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. పార్టీ మారితే ఇక చేరే పార్టీ ఏం ఉంటుంది. ఖచ్చితంగా వైసీపీనే ఉంటుంది. ఆయన చేరిక కోసం జగన్ కూడా వెయిట్ చేస్తున్నారని.. సీఎం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నింటికీ గంటా శ్రీనివాసరావు తాజాగా పుల్ స్టాప్ పెట్టారు.
Ganta Srinivasa Rao : నేను ఏ పార్టీలో చేరడం లేదు.. గంటా శ్రీనివాసరావు క్లారిటీ
అసలు తాను ఏ పార్టీలో చేరబోవడం లేదని.. అదంతా ఉత్త ప్రచారమేనని గంటా శ్రీనివాసరావు కొట్టిపారేశారు. నేను పార్టీ మారుతున్నానని ఎప్పుడైనా చెప్పానా? మీడియాకు చెప్పానా? లేక ఇంకెవరికైనా చెప్పానా? అధికారికంగా స్టేట్ మెంట్ ఎప్పుడైనా ఇచ్చానా? కావాలని మీడియా ప్రచారం చేస్తోంది. మీడియానే కావాలని ముహూర్తాలు కూడా పెట్టేస్తోంది. నిజంగానే నాకు పార్టీ మారాలనే ఆలోచనే ఉంటే నేనే స్వయంగా చెబుతా. అయినా రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి.. కేవలం రెండు పార్టీలు మాత్రమే లేవు అంటూ గంటా చెప్పుకొచ్చారు.