Ganta Srinivasa Rao : వైఎస్ జగన్ స్ట్రాంగ్ ప్రామిస్.. టీడీపీ కి గంటా గుడ్ బై ?
ప్రధానాంశాలు:
Ganta Srinivasa Rao : వైఎస్ జగన్ స్ట్రాంగ్ ప్రామిస్.. టీడీపీ కి గంటా గుడ్ బై ?
Ganta Srinivasa Rao : రాజకీయాలలో నేతలు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో హైప్ కైనా తీసుకెళుతుంది లేదంటే డౌన్ కి అయిన తీసుకెళుతుంది. మధ్యలో అనేది ఆగదు. ఇక ఈరోజు Ganta Srinivasa Rao గంటా శ్రీనివాస రావు తీసుకుపోతున్న నిర్ణయం వైయస్ జగన్మోహన్ రెడ్డి Ys Jagan ఆలోచన ధోరణి మీద ఆధారపడి ఉంది. నిజంగా గంటా వైసీపీలోకి వస్తారా దానికి వైఎస్ జగన్ ఒప్పుకుంటారా లేదా అనేది ప్రశ్న. టీడీపీ పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లాకు బలమైన నాయకుడు. అయితే టీడీపీ TDP అధిష్టానం చీపురుపల్లి నియోజకవర్గానికి పంపిస్తున్నారు. ఈ విషయంపై గంటా కూడా మీడియాతో మాట్లాడారు. విశాఖ 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీపురుపల్లి కి పోటీ చేయమని అధిష్టానం చెప్పిందని, తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే వాస్తవానికి గంట నెలిమర్ల టికెట్ను ఆశిస్తున్నారు…
అయితే ఆ టికెట్ ను ఇచ్చేది లేదని టీడీపీ అధిష్టానం ఇన్ డైరెక్ట్ గా తెలిపింది. గతంలో ఆయన గెలిచిన భీమిలి నియోజకవర్గంని గంటా కోరుతున్నారు. అయితే భీమిలిలో జనసేన నేత సందీప్ అంచర్లకు టికెట్ ఇవ్వడం ఖాయమైంది. అయితే విశాఖకు కూడా పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్ళింది. దీంతో పార్టీలోని సీనియర్ నేతలకు పొత్తు వలన పెద్ద తలనొప్పిగా మారింది. అయితే చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ పోటీగా ఉన్నారు. ఈ క్రమంలోనే చీపురుపల్లిలో ఆయన గెలుస్తారా లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ ఆయన చీపురుపల్లిలో గెలిస్తే తిరుగులేని నేతగా ఎదుగుతారు. బొత్స సత్యనారాయణ బలమైన నాయకుడు. ఈ క్రమంలోనే ఆయన నెల్లిమర్ల టికెట్టును ఆశిస్తున్నారు. దీనికి టీడీపీ ఒప్పుకోవడం లేదు.
ఈ సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గంటాను తమ పార్టీలోకి తీసుకోవాలని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది . భీమిలి నుంచి వైసీపీ తరపున గంటా శ్రీనివాసరావును పోటీ చేయించాలని విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. భీమిలి టికెట్ వైసీపీ నుంచి ఇస్తే అందుకు గంటా శ్రీనివాసరావు ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే గంటా టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచిన గంటకు ఈసారి కూడా అది నీదిక వర్గం కావాలని ఆశిస్తున్నారు కానీ టిడిపి అధిష్టానం పొత్తులో భాగంగా ఆసీటును వేరొకరికి ఇచ్చింది. ఈ క్రమంలోనే గంటా చీపురుపల్లి నియోజకవర్గం పోటీ చేస్తారా లేక వైసీపీ పార్టీలోకి చేరి భీమిలి నుంచి పోటీ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.