Gas prices : గుడ్ న్యూస్ రూ.633.5కే ఎల్పీజీ సిలిండర్.!
Gas prices : భారత్ లో గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొన్నేళ్ల క్రితం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర అమాంతంగా పెరిగిపోవడంతో… ప్రతి నెల సామాన్యులకు భారంగా మారుతోంది. ఇప్పటికే రూ.900లకు పైగా పెరిగిన పోయిన గ్యాస్ ధరలతో పేద వాడి బతుకు బారమైపోతోంది. ఈ నేపథ్యంలో ఇండేన్ గ్యాస్ సంస్థ కస్టమర్లకు ఓ శుభవార్త చెప్పింది. కేవలం రూ.633.5కే ఎల్పీజీ సిలిండర్ ఇస్తామంటూ ఓ ప్రత్యేకమైన ఆఫర్ ను తీసుకొచ్చింది.
అయితే ఇది అన్ని సిలిండర్ల మాదిరి కాకుండా.. కొంచెం తక్కువ బరువు కలిగిన కాంపోజిట్ గ్యాస్ సిలిండర్ అని తెలిపింది. కేవలం 10 గ్యాస్ 10 కిలోల బరువును కలిగి ఉండి.. మహిళలు, వృద్ధులు సులభంగా తీసుకెళ్లెలా ఉంటుందని పేర్కొంది. దీనిపై అమర్చిన ప్లాస్టిక్ తొడుగుతో తుప్పు కూడా పట్టదని ఇండేన్ సంస్థ తెలిపింది. దీని ధర ముంబయిలో రూ.634, కోల్ కతాలో రూ.652, చెన్నై వంటి పలు నగరాల్లో రూ.645 ఉండగా..

gas agency announced composit Gas prices 633
త్వరలో దేశంలోని అన్ని నగరాల్లోనూ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. సాధారణంగా 14.2 కేజీల సిలిండర్ ధర మార్కెట్‌లో రూ.950 వరకు ఉండగా.. 10 కిలోల కంపొసిట్ సిలిండర్ ను రూ.634కే పొందవచ్చు. అయితే దానితో పోలిస్తే ఇందులో 4 కిలోల గ్యాస్ తక్కువగా ఉంటుందన్న విషయం గమనించాలి.