Gas Cylinder Prices : గుడ్ న్యూస్ .. గ్యాస్ ధరలు తగ్గయోచ్… కాకపోతే..!
ప్రధానాంశాలు:
Gas Cylinder Prices : గుడ్ న్యూస్ .. గ్యాస్ ధరలు తగ్గయోచ్... కాకపోతే..!
Gas Cylinder Prices : 2025 మే 1నుంచి వాణిజ్య LPG గ్యాస్ ధరల్లో తగ్గింపు చోటుచేసుకుంది. చమురు మార్కెటింగ్ సంస్థలు తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం .. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు దేశ వ్యాప్తంగా తగ్గాయి. ప్రాంతానుసారంగా ఈ తగ్గింపు పరిమాణంలో వ్యత్యాసం కనిపిస్తున్నా, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారికి ఇది కొంతవరకు ఉపశమనం కలిగించే పరిణామంగా అభివర్ణించవచ్చు. ఉదాహరణకు ఢిల్లీలో ధర రూ.15 తగ్గి రూ.1747.50కి చేరింది. ముంబైలో రూ.1699, కోల్‌కతాలో రూ.1851.50, చెన్నైలో రూ.1906గా వాణిజ్య సిలిండర్ల ధరలు ఉన్నాయి.

Gas Cylinder Prices : గుడ్ న్యూస్ .. గ్యాస్ ధరలు తగ్గయోచ్… కాకపోతే..!
Gas Cylinder Prices : తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్‌లో వాణిజ్య గ్యాస్ ధర రూ.16.5 తగ్గి రూ.1969కి చేరింది. పెద్ద పరిమాణమైన 47.5 కేజీల సిలిండర్ ధర కూడా రూ.41.5 తగ్గి రూ.4198.50గా ఉంది. విజయవాడలో మరింత తగ్గుదల కనిపించింది. అక్కడ 19 కేజీల సిలిండర్ ధర రూ.44.5 తగ్గి రూ.1921 కాగా, 47.5 కేజీల సిలిండర్ ధర రూ.110.5 తగ్గి రూ.4800కి చేరింది. ఈ ధరల తగ్గింపు చిన్న చిన్న వ్యాపారులు, హోటళ్లయనివారి నిత్య ఆర్థిక భారం కొంత మేర తేలిక చేయనుంది.
అయితే గృహ అవసరాల కోసం వినియోగించే LPG సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. హైదరాబాద్‌లో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.905గానే ఉంది, 5 కేజీలది రూ.335.5గా కొనసాగుతోంది. విజయవాడలో గృహ వినియోగ గ్యాస్ ధర 14.2 కేజీలకు రూ.877.5గా ఉండగా, 5 కేజీల సిలిండర్ ధర రూ.326గా ఉంది. గృహ వంట గ్యాస్ ధరలను గతంలో ఏప్రిల్ 8న సిలిండర్‌కు రూ.50 పెంచిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నెల తొలి తేదీన వాణిజ్య, గృహ గ్యాస్ ధరల్లో సమీక్ష జరుగుతూ ఉంటుంది.