LPG Price Hike | అక్టోబర్‌లో పైపైకి గ్యాస్ ధరలు.. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర పెంపు
LPG Price Hike | దసరా, దీపావళి వంటి పండుగల నెల అయిన అక్టోబర్ ప్రారంభమైన రోజే చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం సామాన్యులకి ఊరట కలిగించినా, రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలు వినియోగించే 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం పెరిగాయి.

#image_title
కాస్త ఊరట..
ప్రధాన నగరాల్లో నూతన ధరలు (అక్టోబర్ 1 నుండి అమలు) ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ రూ. 1,595.50 (రూ. 15.50 పెరిగింది), కోల్‌కతాలో 19 కిలోల సిలిండర్ రూ. 1,700.50 (రూ. 16.5 పెరిగింది), ముంబైలో 19 కిలోల సిలిండర్ రూ. 1,547 (రూ. 15.50 పెరిగింది), చెన్నైలో 19 కిలోల సిలిండర్ రూ. 1,754.50 (రూ. 16.5 పెరిగింది), హైదరాబాద్ లో 19 కిలోల సిలిండర్ రూ. 1,817.50 (రూ.16 పెరిగింది.), విశాఖపట్టణంలో 19 కిలోల సిలిండర్ రూ.1,649 (రూ.15.50 పెరిగింది)
గత మూడు నెలల్లో వాణిజ్య సిలిండర్ ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. సెప్టెంబర్‌లో రూ.51.50 తగ్గించాయి,ఆగస్ట్‌లో రూ.33.50,జులైలో రూ.58 తగ్గించారు.అయితే, అక్టోబర్ 1 నుంచి ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది.గృహ వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇది పండుగల సీజన్‌లో సామాన్య ప్రజలకు కొంత ఊరట కలిగించే అంశం.