Gautam Gambhir : పాపం.. గంభీర్ రాకతో ఆ ముగ్గురి కెరీర్ సందిగ్ధంలో పడిందిగా.. రిటైర్మెంట్ తప్పదా ?
ప్రధానాంశాలు:
Gautam Gambhir : పాపం.. గంభీర్ రాకతో ఆ ముగ్గురి కెరీర్ సందిగ్ధంలో పడిందిగా.. రిటైర్మెంట్ తప్పదా ?
Gautam Gambhir : ప్రస్తుతం టీమిండియాలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గంభీర్ రాకతో మొత్తం మారిపోయింది.భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం మార్పుల సీజన్ నడుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాల టీ20 రిటైర్మెంట్ తర్వాత,బీసీసీఐ శ్రీలంక పర్యటన కోసం కొత్త, యువ టీ20 జట్టును ఎంపిక చేసింది. టీమ్ ఇండియా ఎంపికలో కోచ్ గౌతమ్ గంభీర్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన నిర్ణయాలు ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వకుండా సిరీస్ ఆడాల్సిందే అని ఆడిస్తూ జడేజాను మాత్రం పూర్తిగా పక్కనపెట్టేసింది.
Gautam Gambhir గంభీర్ ఎంట్రీతో అందరిలో వణుకు…
యువ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, శివమ్ దూబే అద్భుతంగా రాణిస్తుండటంతో ఇకపై టీమిండియాలో జడేజా అంకం ముగిసినట్లే అని క్రికెట్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం టీ20 వరల్డ్ కప్ 2026, వన్డే వరల్డ్ కప్ 2027ను టార్గెట్‌గా పెట్టుకొని కొత్త టీమ్‌ను నిర్మించాలనే కసితో ఉన్నాడు. అంతకంటే ముందు గంభీర్ ముందున్న టార్గెట్ వచ్చే ఏడాది ఫిబ్రవరీలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025. ఈ ట్రోఫీని ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఉన్న గంభీర్.. టీమ్‌కు భారమైన ఆటగాళ్లను పక్కనపెట్టేయాలని బీసీసీఐకి గట్టి సూచన చేసినట్లు సమాచారం. అందులో భాగంగా రవీంద్ర జడేజాను వన్డేలకు సైతం పూర్తిగా పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది.
టీమిండియా కోచ్ అయిన తర్వాత గౌతమ్ గంభీర్ ధోనీకి సన్నిహితంగా ఉండే ఆటగాళ్లపై విమర్శలు చేశాడు. ఈ ఆటగాళ్లలో మొదటి పేరు రుతురాజ్ గైక్వాడ్. అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత టీ20, వన్డే జట్టు నుంచి తొలగించారు. దీని తర్వాత, మాజీ కెప్టెన్ ధోనీని తన గురువు అని పిలిచిన హార్దిక్ పాండ్యా, టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. అయితే వన్డే జట్టు నుంచి జడేజాకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించడం కూడా గమనార్హం. రుతురాజ్‌తో పాటు అభిషేక్ శర్మ, ముఖేష్ కుమార్‌లకు కూడా జట్టులో చోటు దక్కలేదు. ఇక సూర్య కుమార్‌కి టీ20లో ఛాన్స్ ఇచ్చి వన్డేలలో ఎంపిక చేయలేదు. చాహల్‌ని ఎందులో ఎంపిక చేయలేదు. చూస్తుంటే జడేజా, సూర్య, చాహల్‌ల వన్డే కెరీర్‌కి పులిస్టాప్ పడుతుందని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు.