Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కోచింగ్‌పై మండిపడుతున్న అభిమానులు .. వరుస ఓటములతో పెరుగుతున్న ఒత్తిడి..!
ప్రధానాంశాలు:
Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కోచింగ్‌పై మండిపడుతున్న అభిమానులు .. వరుస ఓటములతో పెరుగుతున్న ఒత్తిడి..!
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్‌లో వరుస పరాజయాలు జట్టును వెనక్కి నెట్టినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వదేశంలోనే ఓటములు ఎదురవడం గంభీర్‌పై ఒత్తిడిని మరింత పెంచుతోంది. జట్టు అవసరాలను పక్కనపెట్టి ఇష్టానుసార మార్పులు, చేర్పులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆటగాళ్ల ఫామ్‌ను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు బలంగా వస్తున్నాయి.ఈ నిర్ణయాలే టీమ్ ఇండియా విజయాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని అభిమానుల ఆవేదన.
Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కోచింగ్‌పై మండిపడుతున్న అభిమానులు .. వరుస ఓటములతో పెరుగుతున్న ఒత్తిడి..!
Gautam Gambhir : న్యూజిలాండ్ సిరీస్‌లో కీలక తప్పిదాలు ?
న్యూజిలాండ్ సిరీస్‌లో ఫామ్‌లో లేని రవీంద్ర జడేజాను ఎంపిక చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.మంచి ఫామ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌ను దూరం పెట్టడం వల్ల మిడిల్ ఓవర్లలో జట్టు ఇబ్బంది పడిందని విశ్లేషణ.బ్యాటింగ్‌లో బలం ఇచ్చే అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని కోల్పోయిందన్న అభిప్రాయం. శుభ్‌మన్ గిల్‌ను జట్టుపై అనవసరంగా రుద్దుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.అదే సమయంలో యశస్వి జైస్వాల్ వంటి ప్రతిభావంతుడిని పక్కన పెట్టడం అభిమానులను నిరాశకు గురిచేసింది.యువ టాలెంట్‌ను సరైన విధంగా వినియోగించలేకపోతున్నారని విమర్శలు.
గంభీర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్లే టీమిండియా ఇబ్బందుల్లో పడుతోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో #RemoveGambhir అనే డిమాండ్ ట్రెండ్ అవుతోంది. కొంతమంది అభిమానులు గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తొలగించాలంటూ బహిరంగ డిమాండ్ చేస్తున్నారు. గంభీర్ స్థానంలో యువరాజ్ సింగ్‌కు కోచింగ్ బాధ్యతలు ఇవ్వాలని కొందరు అభిమానులు కోరుతున్నారు. యువరాజ్ శిక్షణలో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, మంచి నైపుణ్యాన్ని సాధించారని అభిమానుల వాదన. గంభీర్ శిక్షణలో ఉన్న హర్షిత్ ప్రదర్శనపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గంభీర్‌ను తొలగించి వీవీఎస్ లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమించాలంటూ గతంలోనే సోషల్ మీడియాలో ఉద్యమం జరిగింది. అయితే అప్పట్లో వీవీఎస్ లక్ష్మణ్ దీనిపై స్పందించలేదు. ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్ బీసీసీఐలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, తదుపరి టీమ్ ఇండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.