Pension Scheme : ఈ స్కీమ్ లో చేరండి…నెల‌కు 5000 పెన్ష‌న్ పొందండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pension Scheme : ఈ స్కీమ్ లో చేరండి…నెల‌కు 5000 పెన్ష‌న్ పొందండి…

 Authored By anusha | The Telugu News | Updated on :21 June 2022,8:20 am

Pension Scheme : సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ వృద్దుల‌కు ఆర్ధికంగా స‌హాయం చేయాల‌ని వివిధ ర‌కాల పెన్ష‌న్ స్కీమ్ ల‌ను అందిస్తుంది. అందులో ఒక‌టే అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ప‌థ‌కం. ఈ ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం మే 9, 2015 సంవ‌త్స‌రంలో ప్రారంభించింది. ఈ ప‌థ‌కం ద్వారా చాలా మంది పెన్ష‌న్ ను పొందుతున్నారు. ఈ ప‌థ‌కాన్ని పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటి నిర్వ‌హిస్తుంది. ఈ ప‌థ‌కంలో చేరిన‌వారికి వృద్ధాప్యంలో 1000 నుంచి 5000 రూపాయ‌ల వ‌ర‌కు పెన్ష‌న్ ను పొంద‌వ‌చ్చు. అయితే ఈ పెన్స‌న్ ల‌భించాలంటే ఈ ప‌థ‌కంలో చేరిన రోజు నుంచి ప్ర‌తి నెలా కొంత పొదుపు చేస్తూ ఉండాలి.

2021-2022 సంవ‌త్స‌రంలో సుమారుగా కోటి మంది ఈ ప‌థ‌కంలో చేరారు. ఇప్ప‌టి దాకా నాలుగు కోట్ల మంది ఈ ప‌థ‌కంలో చేరారు. ఈ ప‌థ‌కంలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అట‌ల్ పెన్స‌న్ యోజ‌న ప‌థ‌కంలో 18 నుంచి 40 ఏళ్ల లోపు వారు చేరాలి. అంటే 18 ఏళ్ల వ‌య‌సు దాటిన‌వారు 40 ఏళ్ల వ‌య‌సు లోపు వారు ఈ ప‌థ‌కానికి వ‌ర్తిస్తారు. 40 ఏళ్ల వ‌య‌సు దాటిన వారికి ఈ ప‌థ‌కంలో చేరే అవ‌కాశం లేదు. ఈ ప‌థ‌కంలో చేరిన‌వారు ప్ర‌తి నెలా కొంత డ‌బ్బును జ‌మ చేస్తూ ఉంటే వారికి 60 ఏళ్ల వ‌య‌సు దాటాక ప్ర‌తి నెలా పెన్ష‌న్ వ‌స్తుంది. రూ.1000 నుంచి రూ.5000 వ‌ర‌కు పెన్ష‌న్ పొందాలంటే నెల‌కు రూ.42 నుంచి రూ.1,454 మ‌ధ్య పొదుపు చేయాలి. ఏ వ‌య‌సు వారు ఎంత పెన్ష‌న్ పొందాలంటే ఎంత పొదుపు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…

get 5000 rupees pension per monthly with Atal Pension Yojana scheme

get 5000 rupees pension per monthly with Atal Pension Yojana scheme

18 ఏళ్ల వారు: నెల‌కు రూ.1000 పెన్ష‌న్ కోసం ప్ర‌తి నెలా రూ.42
నెల‌కు రూ.2000 పెన్ష‌న్ కోసం ప్ర‌తి నెలా రూ.84
నెలకు రూ.3,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.126
నెలకు రూ.4,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.168
నెలకు రూ.5,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.210 చొప్పున పొదుపు చేయాలి.
20ఏళ్ల వారు: నెలకు రూ.1,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.50
నెలకు రూ.2,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.100
నెలకు రూ.3,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.150
నెలకు రూ.4,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.198
నెలకు రూ.5,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.248 చొప్పున పొదుపు చేయాలి
25 ఏళ్ల వారు: నెలకు రూ.1,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.76
నెల‌కు రూ.2000 పెన్ష‌న్ కోసం ప్ర‌తి నెల రూ.231
నెలకు రూ.3,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.226
నెలకు రూ.4,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.231
నెలకు రూ.5,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.362 చొప్పున పొదుపు చేయాలి.
30 ఏళ్ల వారు: నెలకు రూ.1,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.116
నెల‌కు రూ.3,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.347
నెలకు రూ.4,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.462
నెలకు రూ.5,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.577 చొప్పున పొదుపు చేయాలి.
35 ఏళ్ల వారు: నెలకు రూ.1,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.181
నెలకు రూ.2,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.362
నెలకు రూ.3,000పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.543
నెలకు రూ.4,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.722
నెలకు రూ.5,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.902 చొప్పున పొదుపు చేయాలి.
40 ఏళ్ల వారు : నెలకు రూ.1,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.291
నెలకు రూ.2,000 పెన్షన్ కోసం ప్రతినెలా రూ.582
నెల‌కు రూ.3,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.873
నెలకు రూ.4,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.1164
నెలకు రూ.5,000 పెన్షన్ కోసం ప్రతి నెలా రూ.1454 చొప్పున పొదుపు చేయాలి.
ఇలా 60 ఏళ్ల వయస్సు నుంచి పెన్షన్ పొంద‌వ‌చ్చు. లబ్ధిదారులు ఒక‌వేళ మరణిస్తే వారి జీవిత భాగస్వామికి పెన్షన్ ను తీసుకోవ‌చ్చు. ఇద్దరూ మరణిస్తే పొదుపు చేసిన మొత్తం నామినీకి లభిస్తుంది. ఈ అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ప‌థ‌కం గ‌వ‌ర్న‌మెంట్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులో, ప్రైవేట్ బ్యాంకులలో అందుబాటులో ఉంది. క‌నుక ఎవ‌రైనా ఈ ప‌థ‌కానికి అప్లై చేయ‌క‌పోతే వెంట‌నే వెళ్లి చేసుకోండి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది