Pension Scheme : పెన్షన్ పథకం విషయంలో కేంద్రం కొత్త ప్లాన్.. సూచనలు, మార్గదర్శకాలు ఇవే..!
ప్రధానాంశాలు:
Pension Scheme : పెన్షన్ పథకం విషయంలో కేంద్రం కొత్త ప్లాన్.. సూచనలు, మార్గదర్శకాలు ఇవే..!
Pension Scheme : కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్‌లు తీసుకొస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే 60 సంవత్సరాలు పైబడిన అందరికీ పెన్షన్ అందించే విధంగా.. సార్వత్రిక పెన్షన్ స్కీమ్ Pension Scheme పై కేంద్రం కసరత్తు చేస్తోంది. రిటైర్మెంట్ తర్వాత ప్రస్తుతం సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగుల కోసం.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ భవిష్య నిధి సంస్థలో EPFO చేరే అవకాశం కల్పిస్తోంది.

Pension Scheme : పెన్షన్ పథకం విషయంలో కేంద్రం కొత్త ప్లాన్.. సూచనలు, మార్గదర్శకాలు ఇవే..!
Pension Scheme ఇవి చేర్చే అవకాశం..
కొత్త పథకంలో కొన్ని పాత పథకాలు old scehemes కూడా చేర్చనున్నట్లు వర్గాల ద్వారా సమాచారం. దీని కారణంగా ఈ పథకాలు ఎక్కువ మందిని ఆకర్షిస్తాయి. స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలని ప్రభుత్వం కోరుకుంటోంది. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చు. అతనికి 60 సంవత్సరాల వయస్సు తర్వాత పెన్షన్ లభిస్తుంది.
ఇప్పటి వరకు సంఘటిత రంగానికి చెందిన నిర్మాణ రంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు పొదుపు పథకాలు అమల్లో లేవు.ఉద్యోగం చేస్తున్న వారితో పాటు ఉద్యోగంలో లేనివారు సైతం ఈ పథకంలో చేరేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలపై కసరత్తు ప్రారంభమైందని, త్వరలోనే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని అధికారి ఒకరు వెల్లడించారు. పొదుపు, పింఛన్ Pension పథకాల్ని హేతుబద్ధీకరించి కొత్త పథకానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.