Pension Scheme : త్వరలో రానున్న EPFO పెన్షన్ పథకం…కనీస పెన్షన్ రూ.3000 | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pension Scheme : త్వరలో రానున్న EPFO పెన్షన్ పథకం…కనీస పెన్షన్ రూ.3000

 Authored By aruna | The Telugu News | Updated on :10 September 2022,4:00 pm

Pension Scheme : త్వరలోనే ఈపిఎఫ్ఓ నుంచి అసంఘటిత రంగ కార్మికుల కోసం మరో పెన్షన్ పథకం రానుంది. ఈ పెన్షన్ పథకంలో ఆదాయంతో సంబంధం లేకుండా చేరవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ 15,000 వేతనం దాటిన అసంఘటిత రంగ కార్మికులకు మాత్రమే అందుబాటులో ఉంది. వ్యక్తిగత కంట్రిబ్యూషన్ బట్టి కనీసం 3000 నుంచి పెన్షన్ పొందవచ్చు. లబ్ధిదారులకు 60 ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్ ప్రారంభమవుతుంది. యూనివర్సల్ పెన్షన్ స్కీమ్లో సూపర్ ఏన్యూషన్ పెన్షన్, చిల్డ్రన్ పెన్షన్, విడో పెన్షన్, దివ్యాంగుల పెన్షన్ కూడా ఉండబోతుంది. అయితే ఈ పెన్షన్ పొందాలంటే ప్రస్తుతం 10 ఏళ్లుగా ఉన్న సర్వీసులు 15 ఏళ్లకు పెంచే అవకాశం ఉంది. ఈపీఎఫ్ఓ సభ్యుడు 60 ఏళ్ల లోపు మరణిస్తే కుటుంబానికి పెన్షన్ అందించేలా నిబంధనలు ఉండబోతున్నాయి..

పథకంలో చేరే లబ్ధిదారులు నెలకు కనీసం 3,000 పెన్షన్ పొందాలంటే 5 లక్షల 40 వేలు జమ చేసి ఉండాలి. ఈ పథకంలో చేరేవారు స్వచ్ఛందంగా కంట్రిబ్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పెన్షన్ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా పొదుపు చేయవచ్చు. ఈ పథకంలో ప్రస్తుతం 8.1% వడ్డీ లభిస్తున్న గత నాలుగు దశాబ్దాల్లో ఇదే అతి తక్కువ వడ్డీ. 2021- 22 కాలానికి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. ప్రస్తుతం ఇందులో ఐదు కోట్లకు పైగా లబ్ధిదారులు ఉన్నారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం ఈపీఎఫ్ఓ పెన్షన్ పథకాన్ని నిర్వహిస్తోంది. 20 లేదా అంతకన్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థ తమ ఉద్యోగుల పేరుతో ఈపీఎఫ్ఓ ఖాతాలు తెరవాల్సి ఉంటుంది.

Pension Scheme earn 3000 per monthly

Pension Scheme earn 3000 per monthly

ఉద్యోగి వాటా 12 శాతం యజమాని వాటా 12 శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. యజమాని వాటా 12 శాతం లో 3.67 శాతం ఈపీఎఫ్ లోకి, 8.33% ఏపీఎస్ లోకి వెళ్తుంది. 0.5% ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకంలోకి, 1.10శాతం ఈపీఎఫ్ అడ్మినిస్ట్రేషన్ చార్జీలకు, 0.0 భక్తి శాతం ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం చార్జీల రూపంలో జమవుతాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు జమ చేసిన మొత్తాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కల్పిస్తుంది ఈపీఎఫ్ఓ. ఇందుకోసం ఆన్లైన్లో సులువుగా క్లైమ్ చేయొచ్చు. పిల్లల చదువులు పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం వంటి కారణాలతో ఈపీఎఫ్ ఖాతాదారులు తమ డబ్బుల్ని తీసుకోవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది