Ghee Uses | నెయ్యితో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా.. అయితే ఎలా తీసుకోవాలి అంటే..
Ghee Uses | మన పూర్వీకుల ఆహారపు అలవాట్లలో ఓ ముఖ్యమైన భాగంగా నిలిచిన నెయ్యి , ఇప్పుడు మళ్లీ ఆరోగ్య నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు నెయ్యిలో అధికంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి హితంగా మారుతోంది.

#image_title
ఇన్ని లాభాలా?
నెయ్యిలో ఉండే ముఖ్యమైన పోషకాలు ఏంటంటే.. విటమిన్ A, D, E, K, బ్యూటరిక్ యాసిడ్, ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్,యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం. నెయ్యి వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ A, K వంటి పోషకాలు ఉండటం వల్ల శరీరాన్ని రోగాల నుంచి రక్షించే సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
నెయ్యిలో విటమిన్ D పుష్కలంగా ఉంటుంది. ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది. ఫలితంగా ఎముకలు, దంతాలు బలంగా మారతాయి.నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి. సమతులితంగా తీసుకుంటే ఇది కోలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. నెయ్యిలో ఉండే విటమిన్ A కంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. కంటి వెలుగు పెరగడానికి ఇది సహకరిస్తుంది. నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటంతో చర్మాన్ని చల్లగా ఉంచుతుంది. స్త్రీలు రుతుస్రావ సమయంలో అనుభవించే సమస్యలను తగ్గించడంలోనూ నెయ్యి ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు.