GHMC కీలక నిర్ణయం.. ఇకపై నీరు వృదా చేస్తే. రూ.5 వేలు ఫైన్..!
GHMC : హైదరాబాదులో నీటి వృదాను అడ్డుకట్టవేయడానికి జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు కీలకనిర్ణయం తీసుకున్నారు. వేసవి కాలం రాడవం అలాగే ప్రాజెక్టుల్లో నీటి కొరత కూడా ఉడడంతో నగరంలో నీరు వృదా కాకుండ చేయడానికి అదికారు సిద్దమయ్యారు. బెంగళూరు సిటీ నీటి కొరతతో అల్లాడిపోతోంది. రోజూ 50 కోట్ల లీటర్ల నీటి కొరతతో అక్కడి ప్రజలు అలమటించిపోతున్నారు. వాటర్ ప్రాబ్లం రావటంతో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చేశారు. అలాంటి పరిస్థితి మన నగరానికి కూడా వస్తుతుందేమో అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
GHMC ఇంటికి రూ.5 వేలు ఫైన్
ఈ నేపథ్యంలో నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు సిద్ధమయ్యారు.నీటిని చాలా పొదుపు వాడుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నా.. ప్రజల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. చాలా కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు, బస్తీల్లో రోడ్లపై చిన్నపాటి కాలువలా నీళ్లు వృథాగా పారుతుంటాయి. ప్రస్తుతం నగరంలోనూ కొన్నిచోట్ల నీటి ఎద్దడి ఉందనే వార్తలు వస్తున్నాయి. ఎవరైతే నీళ్లను వృథా చేశారో.. ఆ ఇంటికి రూ.5 వేలు ఫైన్ విధించనున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది రోజూ ఉదయం పూట క్షేత్ర పరిశీలనకు వెళ్తారు.
ఏదైనా కాలనీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్ వద్ద నీరు వృథాగా పోతున్నట్లు కనిపిస్తే.. ఇంటి ఓనర్లకు తెలియకుండానే ఫొటోలు తీస్తారు. ఆ తర్వాత సదరు ఇంటి యజమానులకు ఫైన్లు విధిస్తారు. ఈ మేరకు ఇప్పటికే కరపత్రాలు పంపింణీ చేశారు. నీళ్లను వృథా చేస్తూ పోతే హైదరాబాద్ మరో బెంగళూరు కావడానికి మరెంతో సమయం పట్టదని అందుకే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు చెబుతున్నారు.