Bone Cancer : బోన్ క్యాన్సర్‌తో 14 ఏళ్ల బాలిక ఆవేదన.. దిక్కు తోచక తండ్రి కన్నీటిమయం
Bone Cancer : ఈరోజుల్లో ఎప్పుడు ఎలాంటి వ్యాధి వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ఈ రోజుల్లో ఫుడ్ అంతా కల్తీమయం అయింది కదా. ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి. మంచినీళ్ల దగ్గర్నుంచి పాలు, ఉప్పు, పసుపు, పప్పులు, కూరగాయలు ఇలా.. ఏది తిందా మన్నా అన్నింట్లో కెమికల్స్ కలుపుతున్నారు. ఏది తిన్నా, తాగినా వాటిలో కలిపే కెమికల్స్ శరీరంలో చేరి అవయవాలను దెబ్బ తీస్తున్నాయి. చిన్నపిల్లలను కూడా క్యాన్సర్, గుండె జబ్బులు వేధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకునే పరిస్థితులు కూడా లేవు.
తాజాగా 10వ తరగతి చదివే ఓ బాలికకు బోన్ క్యాన్సర్ వచ్చింది. ముందు చిన్న పుండు కాక అది కాస్త బోన్ క్యాన్సర్ గా మారింది. 14 ఏళ్ల వయసు బాలిక చదువుకోవాలి కానీ.. ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. బోన్ క్యాన్సర్ రావడంతో దిక్కుతోచని స్థితిలో తన తల్లిదండ్రులు ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్ మెంట్ చేయించలేకపోతున్నారు. ట్రీట్ మెంట్ చేయించినా కూడా పాప బతకడం కష్టం అని డాక్టర్లే చేతులెత్తేశారు.కర్నూలు, హైదరాబాద్ లోని అన్ని ఆసుపత్రులు తిరిగారు. చివరకు తనకు ఉన్న క్యాన్సర్ మాత్రం నయం కాలేదు. ముందు కాలుకు చిన్న పుండు కావడంతో అది పెద్దగా ఏం కాదులే అనుకున్నారు.
Bone Cancer : కర్నూలు, హైదరాబాద్ లోని అన్ని ఆసుపత్రుల చుట్టు తిరిగారు
ఇంతలో క్యాన్సర్ రోగం తిరగబడింది. అడ్వాన్స్ స్టేజ్ లోకి వచ్చేసింది. చివరకు కుడి కాలు కూడా తీసేశారు వైద్యులు. అయినా కూడా తన ఆరోగ్యం కుదుటపడలేదు. బసవతారకం ఆసుపత్రికి వెళ్లినా కూడా పాప ఆరోగ్యం కుదుటపడలేదు. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అయినా కూడా పాప బతుకుతుందనే నమ్మకం లేదని డాక్టర్లు చెప్పారు.
ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించారు. అప్పులు చేశారు. ఇంకా ట్రీట్ మెంట్ చేయించడానికి డబ్బులు లేవు. దీంతో ఏం చేయాలో పాప తల్లిదండ్రులకు అర్థం కావడం లేదు. ఎవరైనా ఆదుకొని పాపకు ట్రీట్ మెంట్ చేయించాలని పాప తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.