Sarpanch : సర్పంచ్ పదవి కోసం ఏకంగా రూ.27.60 లక్షలకు వేలం.. సీటు కోసం ఎంతైనా సరే..!
ప్రధానాంశాలు:
Sarpanch : సర్పంచ్ పదవి కోసం ఏకంగా రూ.27.60 లక్షలకు వేలం.. సీటు కోసం ఎంతైనా సరే..!
Sarpanch : పంచాయతీ ఎన్నికల హంగామా sarpanch elections in telangana పల్లెల్లో మామూలుగా ఉండదు. ప్రత్యర్థుల పోటాపోటీ రాజకీయాలతో హైటెన్షన్ వాతావరణమే ఉంటుంది. అయితే ఓ గ్రామ సర్పంచ్ పదవిని ఆ ఊరి పెద్దలంతా కలిసి వేలం వేసి విక్రయించేశారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా రూ.27.60 లక్షలకు ఓ వ్యక్తి సర్పంచ్ పదవిని ఆ వేలంలో కొనేశాడని తెలిసింది. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడలేదు. కానీ ఈ పంచాయతీలో సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఏకంగా వేలం పాట నిర్వహించడం అందరి నోటా చర్చనీయాంశమైంది.
![Sarpanch సర్పంచ్ పదవి కోసం ఏకంగా రూ2760 లక్షలకు వేలం సీటు కోసం ఎంతైనా సరే](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Sarpanch-1.jpg)
Sarpanch : సర్పంచ్ పదవి కోసం ఏకంగా రూ.27.60 లక్షలకు వేలం.. సీటు కోసం ఎంతైనా సరే..!
Sarpanch తగ్గేదే లే..
Jogulamba Gadwal జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని గోకులపాడు Gokulapadu గ్రామంలో సర్పంచ్ Sarpanch పదవి కోసం కొందరు ఆశావహులు పోటాపోటీగా వేలం పాడారు. ఇలా వేలం పాట రూ.27లక్షల వరకు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ఊరితో పాటు చుట్టుపక్కల ఊర్లలోని ఏ నలుగురు ఒక దగ్గర చేరినా, ప్రధాన కూడళ్లు, టీస్టాళ్ల వద్ద ఇదే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది.
భీమరాజు అనే వ్యక్తి నోటిఫికేషన్ రాగానే నగదు చెల్లించి ఏకగ్రీవం చేసేందుకు వేలంపాట వేసినట్టు సమాచారం. కానీ భీమరాజుకు ముగ్గురు పిల్లలు ఉండడంతో, ఎలక్షన్ రూల్ ప్రకారం అతనికి పదవి దక్కుతుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతేడాది అక్టోబర్‌లో కూడా ఇలాంటి న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవెల్లి గ్రామ పంచాయతీకి చెందిన వ్యక్తి తనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.2 కోట్లు ఇస్తానని పేర్కొన్నారు. దీంతో ఈ విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.