Gold Price Today : పసిడి ప్రియులు మళ్లీ చేదు వార్తే.. కొండెక్కిన బంగారం ధరలు
Gold Price Today : గోల్డ్ ధరలు (Gold Price) మళ్లీ పెరిగాయి. నాల్గు రోజులుగా తగ్గినట్లే కనిపిస్తుండడం తో పసిడి ప్రియులు హమ్మయ్య అనుకున్నారు..కానీ ఆలా అనుకున్నారో లేదో ఈరోజు మళ్లీ ధరలు పెరిగాయి. ఏప్రిల్ 10న తులానికి రూ.700 వరకు పెరిగినప్పటికీ, త్వరలో భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Gold Prices) 24 క్యారెట్ల 10 గ్రాములకు సుమారు రూ.90,450 నుండి రూ.90,600 మధ్య ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, ముంబై, విజయవాడ, బెంగళూరు వంటి నగరాల్లో 22 క్యారెట్ల ధర రూ.82,910గా ఉంది. ఢిల్లీలో మాత్రం 22 క్యారెట్ల ధర రూ.83,060గా ఉంది. అంతేగాక, వెండి ధరలు (Silver prices) కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.92,900గా ఉంది, గత రోజు ఇదే సమయంలో ఇది రూ.93,900గా ఉండింది.

Gold Price Today : పసిడి ప్రియులు మళ్లీ చేదు వార్తే.. కొండెక్కిన బంగారం ధరలు
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. రాబోయే నెలల్లో బంగారం ధరలు మరింతగా పడిపోవచ్చని అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మార్నింగ్‌స్టార్‌కు చెందిన విశ్లేషకుడు జాన్ మిల్స్ అంచనా వేస్తున్నారు. ఆయన ప్రకారం, బంగారం ధరలు 38 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఇది నిజమైతే, భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.55,000 వరకు పడిపోవచ్చని భావిస్తున్నారు.