Gold Rates : స్థిరంగా బంగారం ధరలు.. వేచి చూస్తున్న వారికిది శుభ సూచికమే..!
దేశంలో ఒమిక్రాన్ వైరస్ వెలుగు చూసిన తర్వాత బంగారం ధర పెద్దగా పెరగడం లేదు. తగ్గడమో లేదంటే స్థిరంగానో ఉంటోంది. మరి ఇవాళ బంగారం రేటు పెరిగిందా? తగ్గిందా? రాష్ట్రంలో ప్రస్తుతం బంగారం రేటు ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్‌లో రెండు రోజులుగా బంగారం ధరలు మారలేదు.
నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం 45,360 0గా ఉంది. నిన్నటితో పోల్చితే ధరలో మార్పులేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక్క గ్రాము బంగారం ధర రూ.4, 536 పలుకుతోంది.పెట్టుబడుల్లో వినియోగించే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర హైదరాబాద్‌లో రూ.49, 490గా ఉంది. నిన్నటిలో పోల్చితే ధరలో మార్పులేదు. నగరంలో ఒక్క గ్రాము స్వచ్ఛమైన పసిడి ధర రూ.4,949గా ఉంది.
బంగారం ధరలు గత 10 రోజుల్లో ఏకంగా 5 సార్లు తగ్గాయి. మరో 2 సార్లు పెరిగాయి. ఇక కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ. 66,100 కి చేరుకుంది. కొన్ని నెలలుగా బంగారం కొనాలని వేచి చూస్తున్నవారికి ఇది శుభసూచికంగా కనిపిస్తోంది.