Gongura Chicken Recipe : గోంగూర చికెన్ ఇలా చేసి చూడండి.. ఒక్క ముక్క కూడా వదలకుండా తింటారు.
Gongura Chicken Recipe : చికెన్ అంటే మన ప్రపంచం మొత్తం ఎక్కువగా వాడే ఈ చికెన్ లేదా కోడిమాంసం దీన్ని అందరూ ఎక్కువగా ఇష్టపడుతుంటారు దీనిలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు ఎక్కువగా ఉంటాయి సులువుగా జీర్ణమవుతుంది. మాంసకృత్తులు బాగా ఉంటాయి. కండరాల ఎదుగుదలకు మన శరీర అవయవాలు మొత్తం చాలా మంచిగా పనిచేయడానికి ఉపయోగపడతాయి ఈ మాంసకృత్తులు చికెన్ తీసుకోవడం వలన మంచి శక్తి కూడా వస్తుంది అందుకే ఈ చికెన్ అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి చికెన్ తో ఎన్నో రకాలు వంటలు చేస్తుంటాము.అయితే మనం ఈరోజు గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం.
దీనికి కావలసిన పదార్థాలు : 1) చికెన్ 2) ఆయిల్ 3) గోంగూర 4) దాల్చిన చెక్క 5) యాలకులు 6) లవంగాలు 7) బిర్యానీ ఆకులు 8) ఉల్లిపాయలు 9) పచ్చిమిర్చి 9) జిలకర 10) కర్వేపాకు 11) అల్లం వెల్లుల్లి పేస్ట్ 12) టమాటాలు 13) పసుపు 14) ఉప్పు 15) కారం 16) ధనియా పౌడర్ 17) వాటర్ 18) కొత్తిమీర 19) గరం మసాలా మొదలగునవి గోంగూర చికెన్ తయారీ విధానం : స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత గోంగూర వేసి వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో ఒక పావు కప్పు ఆయిల్, వేసుకొని ఒక బిర్యాని ఆకు, ఒక రెండు లవంగాలు, ఒకటి దాల్చిన చెక్క , యాలకులు 2 వేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి తరువాత నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.

Gongura Chicken Recipe In Telugu on video
తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత నాలుగు టమాట ముక్కలు వేసి టమాటా ముక్కలు మెత్తబడేవరకు వేయించి తర్వాత చికెన్ వేసుకొని కలుపుకొని సిమ్ లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. కొద్ది సమయం తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న గోంగూరను వేయాలి. దీనిని వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత రెండు స్పూన్ల కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. తర్వాత ఒక అరకప్పు వాటర్ పోసి బాగా దగ్గరికి అయ్యేలా ఉడికించుకొని తర్వాత గరం మసాలా ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి. తరువాత దింపేముందు కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ రెడీ.
