Gongura Chicken Recipe : గోంగూర చికెన్ ఇలా చేస్తే ఒక్క పూటకే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు…!

Advertisement

ఇవాల్టి రెసిపీ వచ్చేసి మనందరికీ ఎంతగానో ఇష్టమైన గోంగూర చికెన్ ని రెస్టారెంట్లో ఎలా తయారు చేస్తారు. అదే స్టైల్ ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.. దీనికి కావాల్సిన పదార్థాలు : చికెన్, గరం మసాలా, మెంతులు, ఆయిల్ ,కారం ,ఉప్పు ,పసుపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, మొదలైనవి.. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత గోంగూరను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మూడు కట్ల గోంగూరని తీసుకున్నాను

Advertisement

బాగా కలుపుకొని ఐదు నుంచి పది నిమిషాలు పాటు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ గోంగూరని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ ని కూడా వేయాలి. ఉల్లిపాయ పేస్ట్ మగ్గిన తర్వాత దానిలో టమాట పేస్ట్ ని కూడా వేసి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా మగ్గిన తర్వాత చికెన్ వేయాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక గ్లాసు వాటర్ ని పోసి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి.

Advertisement
Gongura Chicken Recipe in Telugu
Gongura Chicken Recipe in Telugu

చికెన్ ఉడికిన తర్వాత రెండు స్పూన్ల కారం ఉప్పు వేసి బాగా కలిపి ముందుగా చేసి పెట్టుకున్న గోంగూర వేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అంటే చికెన్ లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేవరకు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆపి ఆ బౌల్ లోంచి తీసి వేరే బౌల్ లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్లే… ఈ విధంగా గోంగూర చికెన్ చేస్తే ఒక్క పూటకే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర చికెన్.. ఎవరైనా సరే వదలకుండా తింటారు..

Advertisement
Advertisement