Good News : మీ భార్య పేరుపై కొత్త అకౌంట్.. ఇలా చేస్తే నెలకు రూ.44 వేల పింఛన్..
NPS : మనం ఉన్నా.. లేకున్నా.. కుటుంబం ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడొద్దు. అందుకోసం రెగ్యులర్ ఆదాయాన్ని క్రియేట్ చేయాలి.. దీని కోసం మీరు నేషనల్ పెన్షన్ స్కీం (NPS )లో పెట్టుబడి పెట్టాలి. మీ భార్య పేరుపై మీరు కొత్త అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వారికి 60 ఏండ్లు నిండిన తర్వాత మొత్తం డబ్బుతో పాటు నెలకు ఫించన్ సైతం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం చాలా స్కీంలు ప్రవేశ పెడుతూనే ఉంటుంది. ఉదాహరణకు పోస్టాఫీస్‌లో చాలా స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిపై చాలా మందికి అవగాహన లేక వాటిని ఉపయోగించుకోవడం లేదు.
కొందరు సమాచారం తెలుసుకుని వాటి నుంచి ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ స్కీం వల్ల వృద్ధ్యాప్యంలో అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు సైతం ఎదురుకావు.నేషనల్ పెన్షన్ స్కీం గురించి మీరు వినే ఉంటారు. దీనిని ఎలా స్టార్ చేయాలంటే.. కేవలం రూ వెయ్యితో మీ భార్య పేరుపై ఎన్‌పీఎస్ ఖాతా తెరవాలి. ఈ ఖాతా 60 ఏళ్ల వయస్సులో మెచ్యూరిటీ అవుతుంది. కొత్త రూల్స్ ప్రకారం మెచ్యూరిటీ పీరియడ్ ను మరో ఐదు సంవత్సరాలకు పెంచుకోవచ్చు. ఉదాహణకు మీ భార్యకు ప్రస్తుతం 30 ఏళ్లు ఉంటే..
Good News : రూ.వెయ్యితో ఖాతా…
మీరు ఆమె పేరుపై ప్రతి నెలకు రూ5 వేలు పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడిపై ప్రతి ఏటా 10 శాతం రాబడి వస్తే ఆమెకు 60 ఏళ్లు వచ్చే సరికి ఆమె ఖాతాలు రూ.1.12 కోట్లు ఉంటాయి. ఇందులో దాదాపు రూ.45 లక్షలు ఆమెకు అందుతాయి. దీనితో పాటుగా ప్రతి నెలా దాదాపుగా రూ.45 వేల వరకు పింఛన్ పొందుతారు. ఈ పింఛన్ వారు జీవితాంతం పొందొచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం.. ఈ స్కీంలో పెట్టుబడి డబ్బులు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ నిర్వహిస్తారు. ఇందులో మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.