Sip : మనలో అందరూ కోటీశ్వరులే.. నెలకు రూ.4,500 పెట్టుబడితో..!
Sip : మనం కష్టపడితే మహాఅయితే వేలు, లక్షలు మాత్రమే సంపాదించగలం. కానీ డబ్బే డబ్బును సంపాదిస్తే కోటీశ్వరులం కాగలం. అప్పుడు మీలో ఎవరు కోటీశ్వరులు అని అడగాల్సిన పనుండదు. మనలో అందరం కోటీశ్వరులమే అవుతాం. అయితే దీనికి మనం అందరం చేయాల్సింది ఒక్కటే. నెలకు 4,500 రూపాయలను కనీసం 15-20 సంవత్సరాల పాటు కంటిన్యూగా పెట్టుబడిగా పెట్టగలగాలి. రాత్రికి రాత్రే కోటీశ్వరులం కావాలంటే అందరికీ సాధ్యం కాదు కదా. అలాంటి అదృష్టవంతులు నూటికో కోటికో ఒకళ్లు ఉంటారు. కానీ అందరం కోటీశ్వరులం కావాలంటే ఇలా ఒక క్రమపద్ధతిలో డబ్బు దాచుకోవాలి. అదెలాగో చూద్దాం..
సిప్.. బెస్ట్ టిప్.. Sip
చిన్న మొత్తాల పొదుపు.. బతుకు భద్రం.. భవిత బంగారం.. అనే మాట వినే ఉంటారు. దీనికి కార్య రూపమే మ్యూచువల్ ఫండ్స్. లీగల్ గా డబ్బు సంపాదించాలనుకునే ప్రతిఒక్కరూ ఇప్పుడు ఫాలో అవుతున్న సింపుల్ పెట్టుబడి పథకం ఇది. ఇందులోనూ చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపేది సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)పైనే. అందుకే వాళ్లు.. కోటీశ్వరులు కావటానికి సిప్ ని బెస్ట్ టిప్ గా పేర్కొంటున్నారు. అయితే ఈ విధానంలో ఒక ఏడాదికో రెండేళ్లకో భారీ లాభాలను ఆశించకూడదు. మినిమం పదిహేను, ఇరవై ఏళ్ల పాటు ఓపిక పట్టాలి. పెట్టుబడి పెట్టిన సొమ్మును మర్చిపోవాలి. అప్పుడు మాత్రమే మనం నమ్మశక్యంకాని రేంజ్ లో రాబడిని పొందుతాం.
ఏది వీలైతే అది.. : Sip
సిప్ లో పెట్టుబడి పెట్టడానికి మనకు వీలైన వాయిదా పద్ధతిని సెలెక్ట్ చేసుకోవచ్చు. రోజువారీ, వారాల వారీ, నెలల వారీగా ఏది ఇబ్బంది లేకుండా ఉంటుందో దాన్ని ఎంపిక చేసుకోవటానికి వీలుంది. ఎక్కువ మంది మంత్లీ ఇన్ స్టాల్మెంట్ పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఇందులో నెలనెలా దాచుకున్న డబ్బు చక్రవడ్డీ మాదిరిగా పెరుగుతుంది. దీంతోపాటు కాంపౌండింగ్ బెనెఫిట్స్ కూడా ఉంటాయి. నెలలు పోయి ఏళ్లు గడుస్తున్నకొద్ది మన చేతికి రాబోయే డబ్బు ఐదారు రెట్లు అవుతుంది.
ఉదాహరణకు..
నెలకు రూ.4,500 చొప్పున డబ్బు దాస్తే ఏడాదికి రూ.54,000 అవుతాయి. ఇలా 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేయగలిగితే మనం పొదుపు చేసిన డబ్బు మొత్తం రూ.10 లక్షల 80 వేలకు చేరుతుంది. దీనికి 15 శాతం రిటర్న్స్ చొప్పున మనం 57 లక్షల 41 వేల 797 రూపాయలు పొందుతాం. ఈ రాబడికి మన పెట్టుబడి రూ.10 లక్షల 80 వేలను కలిపితే మొత్తం రూ.68 లక్షల 21 వేల 797ను సొంతం చేసుకోవచ్చు. ఈ రూ.4,500కి అదనంగా ఏటా రూ.500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 20 ఏళ్లలో మొత్తమ్మీద కోటి రూపాయలకు పైగానే మన ఖాతాలో చేరతాయి. తద్వారా కోటీశ్వరులం కావొచ్చు.