10th class : టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 50 శాతం ఛాయిస్..!
10th class : రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే 11 పేపర్ల పరీక్షలను 6 పేపర్లకు కుదించిన విషయం తెలిసింది. తాజాగా పరీక్షల్లో 50 శాతం ఛాయిస్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కరోనా సమయంలో ఇప్పటికే దాదాపుగా రెండు సార్లు పదో తరగతి విద్యార్థులు ఈజీగానే పాస్ అయ్యారు. కొవిడ్ కారణంగా దాదాపుగా పాఠశాలలు మూత పడ్డాయి. దీంతో ప్రభుత్వం మొదటి సారిగా ఆల్ పాస్ విధానాన్ని అనౌన్స్ చేసింది. దీంతో పదోతరగతి విద్యార్థులంతా పాస్ అయ్యారు. ఇక పరిస్థితులు కాస్త కుదుటపడటంతో పాఠశాలలు రీ ఓపెన్ అయ్యాయి.
కానీ తిరిగి థర్డ్ వేవ్ సమయంలో సంక్రాంతి సెలవులను పొడిగించి (ఓమిక్రాన్ భయంతో) జనవరి 31 వరకు పొడిగించింది. కానీ ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గిపోవడం, కేసుల సైతం తక్కువగా నమోదు కావడంతో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి.రాష్ట్రంలో మే 11 నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు మొదలు కానున్నాయి. అన్ని పేపర్లలో క్వశ్చన్ పేపర్ లోని 50 శాతం ప్రశ్నలకు మాత్రం ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. పార్ట్ ఏ, బీ రూపంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ 50 శాతం ఛాయిస్ అనేది పార్ట్ ఏకి మాత్రమే వర్తించనుంది.
10th class : పార్ట్ ఏకి మాత్రమే ఛాయిస్
పార్ట్ బీకి సంబంధించి అబ్జెక్టివ్ పేపర్‌లో అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనితో పాటుగ ఈ సారి సిలబస్‌లో కేవలం 70 శాతం నుంచే ప్రశ్నాపత్రాలు తయారుచేయనున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు పాస్ అయ్యే చాన్స్ ఉంది. కరోనా వల్ల విద్యార్థులకు సిలబస్ పూర్తికాకపోవడం, చాలా మంది ఆన్‌లైన్ క్లాసులకు దూరంగా ఉండటంతోనే విద్యార్థులకు నష్టం కలగొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.