Good News : నిరుద్యోగులకు శుభవార్త.. 3,820 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్… అప్లై చేసుకోండిలా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Good News : నిరుద్యోగులకు శుభవార్త.. 3,820 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్… అప్లై చేసుకోండిలా..

Good News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాలను భర్తీ చేసేందుకుగాను కేంద్రప్రభుత్వ సంస్థ ఒకటి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అభ్యర్థుల కోసం ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఈఎస్ఐసీ(ఎంప్లాయి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) తెలిపింది.ఈఎస్ఐసీ భర్తీ చేయబోయే మొత్తం ఖాళీలు 3,820 పోస్టులు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్‌లో పేర్కొంది ఈఎస్‌ఐసీ. ఇకపోతే ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :26 January 2022,9:30 pm

Good News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాలను భర్తీ చేసేందుకుగాను కేంద్రప్రభుత్వ సంస్థ ఒకటి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అభ్యర్థుల కోసం ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఈఎస్ఐసీ(ఎంప్లాయి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) తెలిపింది.ఈఎస్ఐసీ భర్తీ చేయబోయే మొత్తం ఖాళీలు 3,820 పోస్టులు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్‌లో పేర్కొంది ఈఎస్‌ఐసీ. ఇకపోతే ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదువుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల్లో ఏపీలో 35 పోస్టులున్నాయి. అందులో 25 అప్పర్ డివిజన్ క్లర్క్, 26 మల్టీ టాస్కింగ్ స్టాఫ్, 02 స్టెనో గ్రాఫర్ పోస్టులున్నాయి. తెలంగాణలో 72 పోస్టులు భర్తీ చేయనుంది. 25 అప్పర్ డివిజన్ క్లర్క్స్ , 43 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు, 04 స్టెనో గ్రాఫర్ పోస్టులు ఉన్నాయి.ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఎంటీఎస్ పోస్టులకుగాను పదో తరగతి అర్హత. కాగా, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత గా నిర్ణయించారు. అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకుగాను ఏదేని డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు.. స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు అప్లికేషన్ చేసుకునే వారి ఏజ్ 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

Good news for 3820 Central Government jobs notification

Good news for 3,820 Central Government jobs notification

Good News : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే..

ఇకపోతే ఈ పోస్టులకుగాను అప్లికేషన్ ప్రాసెస్ ఆన్ లైన్‌లో ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కు లాస్ట్ డేట్ ఈ నెల 15వ తేదీ. కాగా, పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈఎస్ఐసీ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు. అర్హులైన వారు వీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ ఖాళీల భర్తీకిగాను ప్రిలిమినరీ, మెయిన్స్ టెస్టుతో పాటు స్కిల్స్ టెస్ట్ కూడా ఉంటుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది