Government Jobs : నిరుద్యోగులకు శుభవార్త… ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్… వెంటనే అప్లై చేసుకోండి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Government Jobs : నిరుద్యోగులకు శుభవార్త… ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్… వెంటనే అప్లై చేసుకోండి…!!

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2024,7:30 pm

Government Jobs : ప్రస్తుతం ఈ రోజులలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఫుల్ కాంపిటీషన్ అనేది ఉన్నది. కావున ప్రైవేట్ రంగంలో లక్షల జీతాలు వచ్చిన సరే ప్రభుత్వ ఉద్యోగమే మేలు అంటున్నారు. అందుకే యువత గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా పెట్టుకొని మరీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. లక్ష్యాన్ని ఆ లక్ష్యం చేయకుండా పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరీ మీరు కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా. అయితే మీకు కూడా ఒక గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని డిఫెన్స్ లేబరేటరీ స్కూల్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ లను రిలీజ్ చేసింది. హైదరాబాద్ లోని డిఫెన్స్ లేబరేటరీ స్కూల్ ఆర్ సీఐ కడక్ ప్రతిపాదికన టీచింగ్, అడ్మిషన్ స్టాఫ్ ఖాళీల బర్తీకి నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్ మెంట్ వలన 15 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టులను అనుసరించి డిప్లా మా, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఈడీ,బీఈడీ, టెట్, సీటెట్ ఉత్తీర్ణతతో పాటుగా ఇంగ్లీష్ భాష కంప్యూటర్ పరిజ్ఞానం మరియు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే పోస్టులను బట్టి నెలకు రూ.26 వేల నుండి రూ.38 వేల వరకు జీతం అనేది తీసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూన్ 10లో గా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం. ఈ లింకు పై క్లిక్ చేయండి…

ముఖ్యమైన సమాచారం :

ఖాళీల సంఖ్య :15

విభాగాల వారీగా ఖాళీలు : ప్రైమరీ టీచర్ :04

ట్రెన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ : 05

ల్యాబ్ ఇన్చార్జ్ : 01

ఏఐ టీచర్ : 01

ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ : 02

అడ్మినిస్ట్రేషన్ స్టాప్ : 01

Government Jobs నిరుద్యోగులకు శుభవార్త ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ వెంటనే అప్లై చేసుకోండి

Government Jobs : నిరుద్యోగులకు శుభవార్త… ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్… వెంటనే అప్లై చేసుకోండి…!!

అర్హత :

* పోస్టులను అనుసరించి డిప్లమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడీ, టెట్, సీటెట్ ఉత్తర్ణత తో పాటుగా ఇంగ్లీష్ భాష మరియు కంప్యూటర్ పరిజ్ఞానం మరియు పని అనుభవం కూడా కలిగి ఉండాలి…

వయోపరిమితి : * పోస్టులను అనుసరించి అభ్యర్థులు 25-50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి…

జీతం : ప్రైమరీ టీచర్ రూ.26,000 నుండి రూ.30,000,సెకండరీ టీచర్ 32,000 నుండి రూ.38,000. అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెం డెంట్ రూ.25 వేల నుండి రూ.30 వేల వరకు ఉంటుంది…

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : DEFENCE LABORATORIES’SCHOOL, VIGNYANAKANCHA, RCI, HYDERABAD -500069. Ph. No.040-24301752/53..

మెయిల్ ఐడి : DLSRCI. RECRUITMENT @GMAIL. COM..

దరఖాస్తుకు చివరి తేదీ: •10-06-2024…

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది