YS Jagan : రాజధాని విషయంలో వైఎస్ జగన్ కి గుడ్ న్యూస్ చంద్రబాబుకి బిగ్ బ్యాడ్ న్యూస్
YS Jagan : ఏపీ రాజకీయాలు మరోసారి రాజధానుల చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించగా.. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల అంశం కొత్తగా తెరమీదకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడేండ్లు గడిచినా నేటికీ రాజధానులపై ఇంకా క్లారిటీ రాలేదు. మూడు రాజధానుల బిల్లును జగన్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో పాటు మళ్లీ కొత్త బిల్లు తెస్తానని అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.సగం నిర్మాణాలు పూర్తైన అమరావతి రాజధానిని పట్టించుకోకుండా జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారు.
జగన్ పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించగా.. ప్రస్తుతం అది కూడా దేనికీ నోచుకోలేదు. మూడు రాజధానుల అంశం తెరమీదకు తెచ్చాక మళ్లీ అమరావతిని రాజధానికి కొనసాగిస్తే ఉత్తరాంధ్ర, సీమాంధ్ర ప్రజలు ఉద్యమానికి తెరలేపే ఆస్కారం లేకపోలేదు. రాజధాని నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి కూడా ఏపీ ప్రభుత్వం వద్ద లేదు. ఇప్పటికే మౌలిక సదుపాయాలు, కంపెనీలు విశాఖలో నెలకొల్పబడ్డాయి. అందుకే విశాఖ కేంద్రంగా రాజధాని ఉండాలని జగన్ ప్లాన్ గీస్తున్నారు అయితే, జగన్‌కు చెక్ పెట్టి రాబోయే ఎన్నికల్లో అధికారంంలోకి వచ్చి అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట..
YS Jagan : చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
అందుకే రాబోయే ఎన్నికలు అమరావతి చుట్టూ జరిగితే చంద్రబాబుకు లాభం.అదే ఉత్తరాంధ్రా వంటి వెనకబడిన జిల్లాల వైపు నుంచి పొలిటికల్ డిబేట్ సాగితే కచ్చితంగా టీడీపీ డిఫెన్స్‌లో పడుతుంది.అదే వైసీపీకి కావాల్సిందిగా నిపుణులు అంచనా వేస్తున్నారు.అందుకే జగన్ చలో విశాఖ అంటున్నారని సమాచారం. అలాగని విశాఖ రాజధాని అని చెప్పకుండా.. చంద్రబాబు విశాఖ మీద అమిత ప్రేమను మాటలలో కాకుండా చేతలలో చూపించనున్నారని చెబుతున్నారు.వచ్చే ఎన్నికల్లో బాబు విశాఖ నుంచి పోటీ చేస్తారని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.అలా పోటీ చేయడం ద్వారా ఉత్తరాంధ్రాను టీడీపీ వైపు తిప్పుకునేందుకు బాబు ప్రయత్నం చేస్తున్నారట. ఈ ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచిచూడాల్సిందే.