Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే శాఖలో 2.65 లక్షల ఖాళీలు.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే?
Good News : నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం సర్కారు విడుదల చేసే నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ శాఖల్లో అసలెన్ని పోస్టులు ఖాళీ గా ఉన్నాయి? మరి అతి తక్కువగా ఉంటే కనీసం ప్రైవేటులోనైనా జాబ్ చూసుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పేశారు.కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో రైల్వే శాఖలో ఉన్న ఖాళీల గురించి ప్రకటన చేశారు. రైల్వే ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువకులకు ఈ ప్రకటన ఉత్తేజకరమైనది.
దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 2,65,547 ఖాళీలు ఉన్నట్లు కేంద్రమంత్రి పార్లమెంట్‌లో తెలిపారు. సీపీఎం పార్లమెంటు సభ్యుడు సదాశివన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన బదులు ఇచ్చారు.రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఆయా నియామక సంస్థలకు ఇండెంట్ ఇచ్చినట్లు చెప్పారు. ఈ ఖాళీల్లో 2,177 గెజిటెడ్, 2,63,370 నాన్ గెజిటెడ్ ఖాళీలు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే సౌత్ సెంట్రల్ రైల్వేలో 43 గెజిటెడ్, 16,741 నాన్ గెజిటెడ్ ఖాళీలు కలిపి మొత్తం 16,784 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు.
Good News : ఖాళీల పూర్తి వివరాలివే..
ఇకపోతే దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో వివిధ జోన్లతో కలిపి గ్రూప్-సీ లెవల్-1 పోస్టులు 76,128, మొత్తం 1,89,790 ఖాళీలను భర్తీ చేసినట్లు వివరించారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో పారదర్శకంగా నియామకాలు జరుపుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇకపోతే ఇటీవల తాజాగా సెంట్రల్ రైల్వే భారీగా అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 2,422 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో వివరించారు. ఈ జాబ్స్ భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ ఈ నెల 17 నుంచి స్టార్ట్ అయింది.