AI Edge Gallery | ఇంటర్నెట్ లేకున్నా ఏఐతో పనిచేసే గూగుల్ కొత్త యాప్ ఏంటో తెలుసా?
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను అందించే వినూత్న యాప్‌ను విడుదల చేసింది. ‘Google AI Edge Gallery’ పేరిట విడుదలైన ఈ కొత్త యాప్ టెక్నాలజీ ప్రియులకు చక్కటి గుడ్‌న్యూస్ అని చెప్పొచ్చు.
#image_title
ఇంటర్నెట్ లేకుండానే ఏఐ సేవలు!
ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే – ఫోన్‌లో ఇంటర్నెట్ లేనప్పటికీ కూడా ఇమేజ్‌లు సృష్టించుకోవచ్చు , కోడ్ రాయొచ్చు. ప్రశ్నలకు సమాధానాలు పొందొచ్చు. డాక్యుమెంట్లను విశ్లేషించవచ్చు. స్మార్ట్ రిప్లయ్‌లను పొందొచ్చు. అంటే, డేటా కనెక్షన్ అవసరం లేకుండా ఫోన్‌లోనే అన్ని ఏఐ ఫీచర్లు పనిచేస్తాయి.
ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం యూజర్ డేటా ఎక్కడికీ వెళ్లదు. క్లౌడ్‌కు పంపకుండా, యాప్ ఫోన్ లోకల్‌గా (on-device) అన్ని ఏఐ ప్రక్రియలను నిర్వహిస్తుంది. దాంతో డేటా లీక్ ప్రమాదం తగ్గుతుంది, సెక్యూరిటీ మరింత మెరుగ్గా ఉంటుంది. సర్వర్ డిలే లేకుండా తక్షణ స్పందన లభిస్తుంది. ఈ AI Edge Gallery యాప్ గూగుల్ అభివృద్ధి చేసిన లైట్‌వెయిట్ Gemma 2 (Gemma 2 31B) మోడల్‌పై ఆధారపడి పనిచేస్తోంది.